seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 11:36 am Digital Edition : SEEMA KIRANAM

ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు – కూటమి ముహూర్తం ఫిక్స్..!! | వచ్చే ఉగాది నుంచి ఎన్నికల హామీని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. 2024 ఎన్నిక వేళ ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ సిద్దం చేసింది. నాడు ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. కాగా.. ఇతర హామీల అమలు దిశగా కసరత్తు వేగ వంతం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటు మరిన్ని హామీలు ఇచ్చింది. అందులో భాగంగా ఏపీలో అన్న క్యాంటీన్లపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలు, నగరాల్లో మాత్రమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ప్రారంభించనున్నారు. మండల కేంద్రాల్లో కొత్తగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాది వేళ గ్రామనీ ప్రాంతాలలో ముందుగా 75 అన్నా క్యాంటీన్లను ఓపెన్ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రస్తుతం రూ 5 కే టిఫిన్, నాణ్యమైన భోజన సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. వీటి ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కూటమి రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసారు. కాగా.. వీటిని ఇప్పటి వరకు 3.07 కోట్ల మంది వినియోగించుకున్నారు.

ap-govt-latest-announcement-over-implementation-over-inmolement-మరో-ఎన్నికల-వాగ్దానం-రాబోయే-ఉగాది నుండి

ఉగాది నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు క్యాంటీన్లను పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలనూ విస్తరించేందుకు నిర్ణయించారు. ముందుగా సంక్రాంతి సమయంలోనే రూరల్ ఏరియా లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని భావించారు. అయితే.. పనులు పూర్తి కాక నిర్ణయం అమలు వాయిదా పడింది. ఇప్పుడు ఉగాది వేళ గ్రామీణ ప్రాంతాలు 75 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తున్నారు. దశల వారీగా మరిన్ని పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. ఇందు కోసం ప్రతీ క్యాంటీన్ కోసం రూ. 65 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఉగాది నుంచి వీటిని ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంత పేదలకు మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు.

ఆంగ్ల సారాంశం

తాజా ప్రకటనగా ఉగాది రోజున గ్రామీణ ప్రజలకు సహాయపడే మరో ఎన్నికల హామీని అమలు చేయాలని AP ప్రభుత్వం యోచిస్తోంది

Source link