seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 4:42 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉంది

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

 

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

శ్రీశైలం / నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు  పట్టు వస్త్రాలను ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రం దేశవ్యాప్తంగా విశిష్ట స్థానం కలిగిన శైవక్షేత్రమని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చేయడం ఆనందంగా ఉందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం సమన్వయంతో చర్యలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు. ఆలయ ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సదుపాయాలపై మంత్రికి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్  రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.