అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
వరల్డ్ హ్యాపీనెస్పోర్ రిడు- 2026 ప్రకారం.. ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేసింది. అనేక దేశాల్లో యువత భారీగా సోషల్ మీడియా వినియోగానికి బానిసలు అవుతున్నారని. ఇక ఈ జాబితాలో వరుసగా తొమ్మిదోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ఏడాది యువతపై సోషల్ మీడియా ప్రభావం మరింత స్పష్టంగా హైలైట్ చేస్తోంది.
ఇక ఈ ఏడాది కూడా నార్డిక్ దేశాలు వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ లో ముందు వరుసలో ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్- 2026లోని టాప్ టెన్ దేశాలు చూస్తే.. వరుసగా ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. కోస్టారిక నాలుగో స్థానానికి చేరుకోవడం ఒక లాటిన్ అమెరికన్ దేశానికి ఇదే అత్యధిక ర్యాంకింగ్ కావడం విశేషం. ఈ నివేదికలో 147 దేశాలకు గాను భారత్ 116వ స్థానంలో నిలిచింది. ఇది గత 2025 లో ఉన్న 118వ స్థానం నుండి స్వల్ప మెరుగైన స్థానం అని చెప్పొచ్చు.
ఇక ఈ రిపోర్టు ప్రకారం.. గత దశాబ్ద కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 25 ఏళ్లలోపు వారి జీవితాల్లో సంతృప్తి తగ్గింది. సోషల్ మీడియాలో ఎక్కువ గంటలు గడపడమే దీనికి ప్రధాన కారణమని నివేదించింది. దీనికి విరుద్ధంగా ప్రపంచంలోని ఇతర యువకులు తమ జీవితాల పట్ల మెరుగ్గా భావించారు.
ఫిన్లాండ్ నిలకడగా అగ్రస్థానంలో నిలవడానికి సంపద, దాని సమాన పంపిణీ, ఆర్థిక మాంద్యం వంటి ప్రమాదాల నుండి ప్రజలను రక్షించే సంక్షేమ రాజ్యం, ఆరోగ్యకరమైన ఆయుష్షు స్థాపించడానికి కారణమని నివేదించింది. గత సంవత్సరాల మాదిరిగానే ప్రధాన సంఘర్షణ ప్రాంతాలు ర్యాంకింగ్‌లలో అట్టడుగున ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ మరోసారి చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, మాలావి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ లిస్టులో చివరి పది దేశాలు (138 నుండి 147 ర్యాంకింగ్‌లు) వరుసగా టాంజానియా, ఈజిప్ట్, డీఆర్ కాంగో, లెబనాన్, యెమెన్, బోట్ స్వానా, జింబాబ్వే, మాలావి, సియెర్రా లియోన్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉన్నాయి. సంతోషకరమైన దేశాలు ర్యాకింగ్స్ లో ఈ నివేదిక ఆరు అంశాలను తీసుకుంది. తలసరి జీడీపీ, ఆయుష్షు, సామాజిక మద్దతు, జీవిత ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి అవగాహనలు. దేశాలు ర్యాంకింగ్‌లు 140 దేశాలు, భూభాగాలలోని 100,000 మంది ప్రజలు తమ జీవితాలను రేట్ చేసిన సమాధానాల ఆధారంగా రూపొందించారు. ఈ అధ్యయన గాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం జరిగింది.

శ్రేయస్సు, విస్తృతమైన సోషల్ మీడియా వినియోగం మధ్య ప్రతికూల సంబంధం టీనేజ్ అమ్మాయిలలో ఆందోళన కలిగిస్తోందని నివేదిక. 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా వాడే 15 ఏళ్ల అమ్మాయిల్లో జీవితంపై సంతృప్తి తగ్గింది. ఒక గంట కన్నా తక్కువ వాడే యువత అత్యధిక శ్రేయస్సును నివేదించింది. ఇది అస్సలు ఉపయోగించని వారి కంటే మెరుగని పరిశోధకులు తెలిపారు. 2026 ర్యాంకింగ్‌లు వరుసగా రెండో సంవత్సరంలోనూ టాప్ 10లో ఏ ఆంగ్ల భాష మాట్లాడే దేశం కనిపించలేదని సూచిస్తున్నాయి. అమెరికా 23వ స్థానంలో, కెనడా 25వ స్థానంలో, బ్రిటన్ 29వ స్థానంలో నిలిచాయి.

