seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 6:02 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాలు ఇవే..! | శాంతియుత దేశాలు 2026లో ప్రపంచంలో అత్యధికంగా టాప్ 10 – సురక్షితమైన & ప్రశాంతమైన దేశాలు తాజా ర్యాంక్‌లను కలిగి ఉన్నాయి!

అంతర్జాతీయ

-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రస్తుతం ఏ దేశంలో చూసినా యుద్ధం, ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఒక దేశంలో ఉద్రిక్తతలు సద్దుమణిగేలోపు మరో దేశంలో ప్రారంభం అవుతున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచంలో సురక్షితమైన దేశాలు ఉన్నాయా..? అనే అనుమానం వస్తుంది. అయితే తాజా ప్రకారం.. ప్రపంచంలోనే సురక్షితమైన దేశాలు, నగరాల వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఆఖరికి సురక్షిత ప్రాంతాలుగా భావించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబి, దుబాయ్ వంటి నగరాలను సైతం ఈ యుద్ధం తాకింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక కార్యకలాపాలు ఇరాన్ లోపల పలు వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపైన అలాగే అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే తాజాగా నుంబియో సంస్థ రూపొందించిన ప్రపంచంలో అత్యంత సురక్షితమైన పది నగరాల జాబితా చూస్తే.. 1. క్వింగ్‌ దావో, షాన్‌డాంగ్, చైనా 2. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3. దోహా, ఖతార్ 4. షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6. తైవాన్ తైపీ. 8. మస్కట్, ఒమన్ 9. ది హెగ్, నెదర్లాండ్స్ 10. ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్ ఉన్నాయి.

ఇక ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన 10 దేశాల జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదు. ఇన్‌ఫర్మేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 10 అత్యంత సురక్షితమైన దేశాల జాబితా చూస్తే.. ఐస్‌ ల్యాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో ఐర్లాండ్ రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశాలు అంతర్జాతీయంగా శాంతిభద్రతలకు ప్రమాణంగా నిలుస్తున్నాయి.

శాంతియుత దేశాలు టాప్ 10 ప్రపంచంలో అత్యంత 2026 2026 సురక్షితమైన ఆంప్ ఆంప్ కామెస్ట్ నేషన్స్ ర్యాంక్ చేసిన తాజా ర్యాంక్‌లు

ఇక ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నాలుగో సంఖ్యలో పంచుకున్నాయి. అలాగే సింగపూర్ ఆరో స్థానంలో నిలిచింది. పోర్చుగల్, డెన్మార్క్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు స్లోవేనియా తొమ్మిదో స్థానంలో, ఫిన్ ల్యాండ్ పదో స్థానంలో చోటు సంపాదించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాలుగా గుర్తింపు పొందాయి.

ఆంగ్ల సారాంశం

గ్లోబల్ పీస్ ఇండెక్స్ అబుదాబి మరియు దుబాయ్‌తో సహా నగరాలను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటిగా పేర్కొంది, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్థిరమైన పట్టణ భద్రతను ప్రతిబింబిస్తుంది. నివేదిక ఇతర అగ్ర నగరాలతో పాటు UAE యొక్క పట్టణ భద్రతను హైలైట్ చేస్తుంది మరియు శాంతి సూచిక మెట్రిక్‌లు మరియు మెథడాలాజికల్ నోట్‌లతో డేటాను సందర్భోచితంగా చేస్తుంది.

Source link