seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 7:43 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రతిపక్షాలకు ఆయుధంగా పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు సంచలన నిర్ణయం! | చంద్రబాబుకు తలనొప్పి: ప్రతిపక్షాల టార్గెట్‌తో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై తీవ్ర నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉండటం టీడీపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మొదట పుట్ట మహేష్ కుమార్ యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ నెగిటివ్ రాగా, బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన టీడీపీ ఎంపీ వ్యవహారం

ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న ఏలూరు ఎంపీ, అందులోనూ అధికార టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే ప్రభుత్వంలో వైఫల్యాలను అడుగడుగునా కూటమి వైసిపి నాయకులు టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ తాజా వ్యవహారం వైసీపీ చేతికి అస్త్రాన్ని అందించినట్లుగా తయారైంది. వైసిపి నాయకులు టిడిపిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రతిపక్షం టార్గెట్‌తో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో చంద్రబాబుకు తలనొప్పి

టీడీపీ తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ వైసీపీ టార్గెట్

ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చెబుతున్న కూటమి ప్రభుత్వం, తమ ప్రభుత్వం లోనే ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న డ్రగ్స్ ఎంపీ పైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. టిడిపి పేరును తెలుగు డ్రగ్స్ పార్టీగా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు దొరకడం రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటని, ఆయన ఎంపీగా కొనసాగే అర్హత లేదని వైసిపి నేతలు మండిపడుతున్నారు.

చంద్రబాబుకు వైసీపీ డిమాండ్

సీఎం చంద్రబాబుకు దమ్ముంటే తక్షణమే పుట్ట మహేష్ ను టిడిపి నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా, చంద్రబాబు తక్షణం పుట్ట మహేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపీ దొరకడం సిగ్గుచేటు అన్నారు.

చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని షర్మిల ప్రశ్న

ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందులు చిందులు చేస్తున్నాడని, ఇది ఎక్కడి బాధ్యతారాహిత్యం అంటూ వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని షర్మిల నిలదీశారు. డ్రగ్స్ తీసుకున్న ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ప్రోత్సహిస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.

కఠిన చర్యల దిశగా చంద్రబాబు

పుట్ట మహేష్ పైన అనర్హత వేటు వేయాలని, పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయడానికి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో అవినీతి, నేరారోపణలు ఎదుర్కొన్న నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకున్న నేపథ్యం ఉంది, పుట్టా మహేష్ కుమార్ పై టీడీపీ కఠిన చర్యలకు సిద్ధమైంది.

ఉపేక్షించేది లేదు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం

ఈ కోరనే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరు ఉప్పేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని. పైన కోరుతూ నోటీసులు అందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు వివరణ. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశాన్ని అందించారు, వ్యక్తులు, నేతలు తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని చంద్రబాబు చెప్పారు.

ఆంగ్ల సారాంశం

డ్రగ్స్ కేసులో వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే పల్లా శ్రీనివాసరావును వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

Source link