seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:50 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రజా సేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

ప్రజలకు రెవెన్యూ  సేవలు అందించడంలో ముందంజలో ఉన్న కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు

 

కల్లూరు, జూలై 13, (సీమకిరణం న్యూస్) :

 

కల్లూరు మండల తహసీల్దార్  ఆంజనేయులు ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు. రెవెన్యూ పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు సత్వర సేవలందించడం, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలులో ఆయన విశేష కృషి చేశారు. మండల పరిధిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల అందజేత, ధ్రువపత్రాల జారీ వంటి అంశాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతంగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించేందుకు తహసీల్దార్ ఆంజనేయులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో కల్లూరు మండలం 94 శాతం పురోగతిని సాధించింది. తహసీల్దార్ ఆంజనేయులు పర్యవేక్షణలో బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకుని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. అధికారులతో సమన్వయం, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం, బాధ్యతాయుతమైన పరిపాలనతో కల్లూరు మండల ప్రజల అభిమానాన్ని ఆంజనేయులు సంపాదించుకున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తూ సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. మండల ప్రజలకు సేవలందించిన ఎమ్మార్వో ఆంజనేయులు భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ముందుకు సాగాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.