seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 2:13 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరం 

ఎస్సై నరేష్ చేతులు మీదుగా చలివేంద్రం ప్రారంభం

 

 వెల్దుర్తి, మార్చి 22, (సీమకిరణం న్యూస్ ) :

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరమని వెల్దుర్తి ఎస్ఐ నరేష్ అన్నారు. ఆదివారం వెల్దుర్తి పట్టణంలోని బింగిదొడ్డి,ఎల్ నగరం గోవర్ధనగిరి ఆటో స్టాండ్ లో బింగ్ దొడ్డి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కల్లె శివన్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఆదివారం ఎస్సై నరేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవి కాలం నందు ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చల్లని నీతిని అందించినటువంటి బింగ్ దొడ్డి కల్లెశివన్నను అభినందించారు. అనంతరం కళ్ళే శివన్న కుమారుడు కార్తికేయ చేతులతో గ్లాసులలో నీటిని పట్టి ప్రజలకి అందజేశారు. మొదటి గ్లాస్ నీటిని ఎస్ఐ నరేష్ కు అందించారు. ఆ తర్వాత ప్రజలు నీటిని తాగి దాహార్తిని తీర్చుకున్నారు. మట్టి నీటి కుండలలో నీటిని నింపి మినరల్ వాటర్ ప్రజలకు మరియు ఆటో స్టాండ్ నందు ఉన్నటువంటి డ్రైవర్లకు దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు బింగు దొడ్డి గ్రామానికి చెందిన మహేంద్ర రెడ్డి, రాంగోపాల్, బాలు, ఆర్ రాజశేఖర్, లక్ష్మణ కుమార్, కే మదిలేటి, వెల్దుర్తికి చెందిన 108 డ్రైవర్ ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు.