seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:35 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

 

“మిలాద్ ఉన్ నబీ ” శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్

 

అమరావతి, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్):

 

ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ అందరికీ మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలను మైనారిటీ,న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మిలాద్ ఉన్ నబీ ఒకటని మంగళవారం అమరావతి లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ఈ రోజును భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని, బోధనలను పాటిస్తూ, ఆదర్శంగా నిలవాలని అన్నారు.నిజాయితీ, దయ, క్షమ, ప్రేమ, సహనం, ఇతరులకు సహాయం చేయడం వంటి విలువలకు ప్రవక్త ఇచ్చిన ప్రాధాన్యతను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు మంత్రి ఫరూక్ తెలిపారు.