seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 2:22 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రచారార్భాటం లేకుండా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం | రాణిపేటలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌ తయారీ కేంద్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు.

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

జాగ్వార్ ల్యాండ్ రోవర్.. తమిళనాడులో భారీ తయారీ ప్లాంట్ ను నెలకొల్పింది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో టాటా మోటార్స్ దీన్ని స్థాపించింది. ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఇక్కడే తయారవుతాయి. రాణిపేట సమీపంలోని పణపాక్కం సిప్‌కాట్‌లో ఏర్పాటైన ఈ తయారీ కేంద్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పారిశ్రామిక, పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో కలిసి ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సువర్ణ దినంగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై టాటా చూపిన నమ్మకానికి గర్వపడుతున్నానని, రాణిపేట జిల్లాలో 9,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టినందుకు ఆ సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. స్టీల్, ఐటీ, ఆటోమొబైల్స్ వంటి అనేక రంగాలలో టాటా దేశంలో కీలక పాత్ర పోషించిందని, దేశానికి అపారమైన విలువను సృష్టిస్తోందని స్టాలిన్ ప్రశంసించారు.

రాణిపేటలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌ తయారీ కేంద్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు.

టాటాకు బలమైన బ్రాండ్ విలువ ఉందని, తమిళనాడుకు టాటా గ్రూప్‌తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళనాడులో ఈ అభివృద్ధికి కొనసాగుతున్న ద్రావిడ నమూనా పాలనే కారణమని అభిప్రాయపడ్డారు. అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం మాత్రమే కాకుండా, వాటిని ప్రాజెక్టులుగా మార్చి అమలు చేయాలని ఎప్పుడూ చెబుతుంటుందని. రోవర్ తయారీ కేంద్రం ద్వారా 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, వేలాదిమందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్లాంట్ నుండి మొదటి రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్ విడుదలైంది. కంప్లీట్లీ నాక్డ్ డౌన్‌లోడ్ వాహన అసెంబ్లీ కార్యకలాపాలను పుణే నుండి ఈ అత్యాధునిక కేంద్రానికి మార్చింది టాటా మోటార్స్. ఈ ప్లాంట్‌పై టాటా మోటార్స్ 9,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని కేటాయించింది. రాబోయే అయిదు నుండి ఏడు సంవత్సరాలలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లను పెంచనుంది. తొలి దశలో 900 కోట్ల పెట్టుబడితో 20,000 రేంజ్ రోవర్ వాహనాలను ఉత్పత్తి చేస్తారు.

ప్రతి వాహనానికి సుమారు 1,300 విడిభాగాలు అవసరం. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఇక్కడే తయారవుతాయి. ఈ ఏడాది జనవరి నాటికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (TMPV) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1,36,062.15 కోట్ల రూపాయలు. దీని ట్రాప్లింగ్ 12 నెలల నిష్పత్తి 20.6 రెట్లు అధికం. ఈ సంస్థ విలువ వృద్ధి అంచనాలను ప్రతిబింబిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ విస్తరణలో పెట్టుబడికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పోటీదారులు భారీ మార్కెట్ క్యాప్‌లను కలిగి ఉన్నారు. ఇప్పటికే బీఎండబ్ల్యూ, హ్యుందాయ్, నిస్సాన్, రెనాల్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలతో ఆటోమొబైల్ తయారీ కేంద్రానికి కేరాఫ్ గా నిలిచింది. బీఎండబ్ల్యూ చెన్నైలో సీకేడీ ప్లాంట్‌ను కూడా నడుపుతోంది.

ఆంగ్ల సారాంశం

రాణిపేటలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ తయారీ కేంద్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడుకు, ముఖ్యంగా తమిళనాడు పారిశ్రామిక రంగానికి ఈరోజు బంగారు దినమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును టాటా గ్రూప్ ప్రారంభించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్.. తమిళనాడులో భారీ తయారీ ప్లాంట్ ను నెలకొల్పింది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో టాటా మోటార్స్ దీన్ని స్థాపించింది.

Source link