seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 1:53 pm Digital Edition : SEEMA KIRANAM

పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు! | ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త.. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా పనులు చేస్తున్నారు. ఈ కోరికనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు హస్తినకు వెళుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఈ పర్యటనలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్‌ పాటిల్‌తో చర్చించి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు

పోలవరం ప్రాజెక్ట్ పై శుభవార్త చెప్పిన చంద్రబాబు

ఈ హామీనే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపైన శుభవార్త చెప్పారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశారు చంద్రబాబు ప్రకటించారు. గతంలో 480 కోట్లతో నిర్మిస్తే దానిని కాపాడలేక గత ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ ఇప్పుడు వెయ్యి కోట్లతో నిర్మాణం చేస్తున్నట్టు త్వరలోనే అది పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు.

2026 జూన్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి

పోలవరం ప్రాజెక్టును నిర్మించిన జాతికి అంకితం చేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని దీని నిర్మాణం చేస్తున్నబవర్ కంపెనీ ప్రకటించింది.

పోలవరం ప్రాజెక్ట్ పనులలో వేగం పెరిగింది

ఇప్పటికే దాదాపు 93 శాతం పైగా పనులు పూర్తికాగా మిగిలిన పనులలో వేగం పెంచారు. ఏది ఏమైనా చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతుంది. ఈ మేరకు చంద్రబాబు సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని సంకల్పించి ముందుకు వెళుతున్నారు.

ఆంగ్ల సారాంశం

తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Source link