వేల్పనూరు , మే 17, (సీమకిరణం న్యూస్) : పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పనూరు నందు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 30 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందుతుందని అన్నారు.