seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 1:30 am Digital Edition : SEEMA KIRANAM

పెట్రో ధరల పెంపుపై తేల్చేసిన కేంద్రం..! 25 రోజులకే చమురు నిల్వలు..! | ఇంధన ధరల పెంపు స్పష్టీకరణ: యుద్ధం మధ్య భారతదేశం యొక్క 25-రోజుల చమురు నిల్వపై ఆందోళనలకు కేంద్రం స్పందించింది

భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)మూకుమ్మడిగా ప్రారంభమైన యుద్ధం ఇవాళ నాలుగో రోజు కొనసాగుతోంది. మరో నాలుగైదు వారాలు యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. అటు ఇరాన్ తమ పొరుగునే ఉన్న హార్ముజ్ జల సంధి గుండా వెళ్లే చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జల సంధి దగ్గరే వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ వైపు నుంచి సగం చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ అలర్ట్ అయింది.

దేశంలో ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలపై కేంద్రం అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుంటున్నారు. తాజా వివరాల ప్రకారం మన దేశంలో మరో 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ దొరకవన్న భయాలు మొదలైతే ఈ నిల్వలు అంతకన్నా ముందే ఖాళీ అయిపోవడం ఖాయం. ఈ కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పటికే పెట్రోల్ బంకులకు జనం క్యూ కడుతున్నారు. దీనితో కేంద్రం పెట్రో ధరల పెంపు (ఇంధన ధరల పెంపు), తాజా పరిస్ధితిపై క్లారిటీ ఇచ్చింది.

భారతదేశం యొక్క 25-రోజుల చమురు నిల్వపై ఆందోళనలకు ఇంధన ధరల పెంపు స్పష్టీకరణ కేంద్రం ప్రతిస్పందిస్తుంది

భారతదేశంలో ప్రస్తుతం ముడి చమురుశుద్ధి చేసిన ఇంధన నిల్వలు దాదాపు 25 రోజుల పాటు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ముడి చమురు, ఎల్పీజీ , ఎల్ఎన్జీ దిగుమతికి ప్రత్యామ్నాయ దేశాల అధికారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధర పెంచే తక్షణ ప్రణాళిక లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు వరుసగా మూడో సెషన్‌లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటైన మధ్యప్రాచ్యం నుండి సరఫరాలకు అంతరాయం కలగవచ్చన్న వ్యాపారుల ఆందోళనే ఇందుకు కారణం.

Source link