seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 3:22 am Digital Edition : SEEMA KIRANAM

పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ? | గ్లోబల్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ప్రభావం ముడి చమురు మధ్య భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి

భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది.

దీంతో ఇక అందరి దృష్టి కూడా పెట్రోల్ రేట్లపై పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం దీనికి మరింత బలాన్ని ఇచ్చింది. సరఫరా అంతరాయల భయాల మధ్య, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ బ్యారెల్‌కు అయిదు పెరిగింది. బ్యారెల్ ఒక్కటింకి 103.14 డాలర్ల వద్ద స్థిరపడింది.

గ్లోబల్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ప్రభావం ముడి చమురు మధ్య భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి

యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో సైతం క్రూడ్ ధర కూడా భారీగా పెరిగింది. ఏకంగా 8.1 శాతం పెరిగి 98.86 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రికార్డు స్థాయి ధర. దీనితో వీటి రేట్లపై కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ సమీక్షించనుందని సమాచారం. ఇది- దేశీయ పెట్రో రేట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో వీటి రేట్లను కూడా కేంద్రం సవరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

ఆంగ్ల సారాంశం

గ్లోబల్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ప్రభావం ముడి చమురు మధ్య భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మార్చి 15 ఆదివారం నాడు అనేక భారతీయ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి.

Source link