seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 2:56 am Digital Edition : SEEMA KIRANAM

పెట్రోల్, డీజిల్ భారంగా మారనుందా? | ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు అధ్యయనంగానే ఉన్నాయి

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు ముడిచమురు కొనుగోలు వ్యయం 93 శాతం పెరిగింది. కిందటివారం బ్యారెల్ ధర 120.56 డాలర్లకు చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి.

ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయ ధరలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభానికి ముందు 65 నుండి 70 ఇప్పుడు డాలర్ల వరకు పలికిన క్రూడాయిల్ బ్యారెల్ ధర 100 డాలర్ మార్క్ ను దాటేసింది. గరిష్ఠంగా 120 డాలర్లకు చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది గానీ అది స్వల్పమే. ప్రస్తుతం 102- 103 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ ఒక్కింటికి 102.51 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్‌కు 93.13 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు అధ్యయనంగానే ఉన్నాయి

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

ఆంగ్ల సారాంశం

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర అస్థిరతను అనుభవిస్తున్నప్పటికీ, భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు రోజులో మారలేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇంధన ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేస్తాయి.

Source link