పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్):
జిల్లాలో పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు తహసిల్దార్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్లు ,డి.ఎస్.ఓ, ఏఎస్ఓ లు ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు పెట్రోల్ బంకుల యజమానులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల యజమానులు నిలువ ఉంచుకొని కూడా విక్రయాలు జరపని పెట్రోలు బంకులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సేల్స్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ నిల్వలు ఖాళీ అయిపోతున్న పెట్రోల్ బంకులకు లోడ్లు సరఫరా చేయించడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పెట్రోల్ బంకు ఒక పర్యవేక్షణ అధికారిని నియమించవలసిందిగా అందరు తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో తాగునీటి వసతి టాయిలెట్ వసతి గాలి నీరు ప్రొవైడ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ డీజిలు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ చర్యలు హెచ్చరించారు.