seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 3:43 am Digital Edition : SEEMA KIRANAM

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! | పీఎం కిసాన్ – అన్నదాత సుఖీబావ నిధులు వచ్చే వారంలో రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

రైతులకు బిగ్ న్యూస్. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొంత కాలంగా రైతులు ఎదురుచూస్తున్న నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్ తో పాటుగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అంతకు ముందే రైతులకు కీలక సూచన చేసింది.

పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందించే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ తేదీన ప్రధాని విడత నిధులను విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 22వ విడత నిధులను ముందుగా సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 24వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.

pm-kisan-అన్నదాత-సుఖీబావ-నిధులు-రైతులలో-ఖాతాలు-వచ్చే-వారంలో-లేటెస్ట్-ప్రతినిధిగా విడుదలయ్యే అవకాశం ఉంది

కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్‌తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్‌తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం రూ.20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు మినహాయించి.. మిగిలిన రూ.14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్‌తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో… పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఈ నెల (మార్చి) 14వ తేదీన రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ.6 వేలు జమ అయ్యే అవకాశం ఉంది.

రైతులకు కీలక ప్రభుత్వం సూచనలు

అంతకంటే ముందు రైతులు.. ఈ- కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాలి. లబ్ధిదారుల కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లోనూ ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ యాప్‌లో ముఖ గుర్తింపు ద్వారా కూడా కేవైసీ పూర్తిచేయవచ్చు. సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు.. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపించే మీ స్థితిపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, మండలం, గ్రామ పేర్లను నమోదు చేసి.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందవచ్చు.

ఆంగ్ల సారాంశం

అన్నదాత సుఖీబావ నిధులతో పీఎం కిసాన్ 22వ విడత కూడా వచ్చే వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Source link