అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు ఒకరి భూభాగంపై మరొకరు వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఆఫ్గాన్‌లోని నంగర్‌హర్, పక్తికా ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకగా పాకిస్థాన్ సరిహద్దులపై తాలిబన్ దళాలు దాడులు చేసి.. కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు తెలిపాయి.
దీంతో ఆఫ్గాన్ లోని కాబూల్, కందహార్‌లపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27న ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్, నౌషేరా, జమ్రూద్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కార్యాలయాలపై ఆఫ్గాన్ విమానాలు వైమానిక, డ్రోన్ దాడులు చేపట్టారు. అయితే తాజాగా పాకిస్థాన్ సైనిక బలగాలు జరిపిన భారీ వైమానిక దాడుల్లో దాదాపు 331 మంది ఆఫ్గాన్ తాలిబన్ సైనికులు మరణించినట్లు పాక్ అధికారులు గుర్తించారు.
ఈ పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ధ్రువీకరించారు. పాక్ సైన్యం సుమారు 104 ఆఫ్ఘన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేసిందని.. అలాగే 163 ట్యాంకులు, సాయుధ వాహనాలను నిర్వీర్యం చేసినట్లు గుర్తించారు. మరోవైపు ఆఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పాక్ స్థావరాలపై దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. జలాలాబాద్ లో పాకిస్థాన్ కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఆఫ్గాన్ స్పష్టం చేశాయి. అదే సమయంలో పారాచూట్ సాయంతో ఆ పైలట్ కిందకు దూకే యత్నం చేయగా తమ బలగాలు అతడ్ని సజీవంగా బంధించినట్లు ఆఫ్గానిస్థాన్ సైనిక ప్రతినిధి వాహీదుల్లా మొహమ్మదీ తెలిపారు.

అయితే పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తమ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం, పైలట్‌ను బంధించడం పూర్తిగా అవాస్తవం అని. ఈ మేరకు అఫ్గానిస్థాన్ వ్యాఖ్యలను ఖండించింది. పాకిస్థాన్- ఆఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే.. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.

