అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
ఆఫ్గానిస్తాన్‌లో పాకిస్థాన్ జరిపిన తాజా వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో పౌరులకు ప్రాణనష్టం, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది “సార్వభౌమ అఫ్గానిస్తాన్ కు శత్రువైన పాకిస్తాన్ మరో ఆక్రమణ చర్య” అని ఆయన అభివర్ణించారు. ఆఫ్గానిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను స్థాయిలో గౌరవించాలని భారత్ తన నిబద్ధతను బలంగా పునరుద్ఘాటించిందని అన్నారు.
అయితే భారత్ స్పందించడం కంటే ముందు.. ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఆరోపణలు చేసింది. కాబూల్, తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులు జరిగాయి. కాందహార్ విమానాశ్రయం సమీపంలోని కామ్ ఎయిర్ ప్రైవేట్ ఎయిర్‌లైన్ కు చెందిన ఇంధన డిపోలపై కూడా పాక్ విమానాలు దాడి చేశాయని ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
కొన్ని గంటల తర్వాత, కాబూల్ కూడా ప్రతిస్పందించినట్లు ప్రకటించి, ఇస్లామాబాద్‌తో పాటు వాయువ్య పాకిస్థాన్‌లోని సైనిక స్థావరాలను తమ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా నివేదనల ప్రకారం, పాకిస్తాన్.. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని.. తమ దాడులు పాకిస్తానీ తాలిబాన్ మిలిటెంట్లు, వారి సహాయక నెట్‌వర్క్‌లపైనే దృష్టి సారించాయని. ఈ మేరకు ఈ ఘర్షణను ఓపెన్ వార్ గా అభివర్ణించింది.

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ, ఈ ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వంపై అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆఫ్గానిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తమ దేశంలో పాకిస్తానీ మిలిటెంట్ గ్రూపులకు, ముఖ్యంగా పాకిస్తానీ తాలిబాన్‌కు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ మిలిటెంట్లు సరిహద్దు దాటి తమ బలగాలపై దాడి నిలిపివేసారు, ఆఫ్గానిస్తాన్ తమ ప్రత్యర్థి భారత్‌తో జతకడుతోందని పాక్ గుర్తు. అయితే కాబూల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.

