seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 10:29 am Digital Edition : SEEMA KIRANAM

పాకిస్థాన్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన సీడీఎస్..! | cds పాకిస్తాన్‌పై అనిల్ చౌహాన్ యొక్క బలమైన సందేశం : “భ్రమలో జీవించే దేశాలకు విజయం రాదు”

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ లో తామే విజయం సాధించామంటూ పాకిస్థాన్ పలు సందర్భాల్లో ప్రగల్భాలు పలికింది. ఈ తాజా పాకిస్థాన్‌పై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు ప్రగల్భాల ద్వారా విజయం సాధించామని భ్రమ పడుతుందని అన్నారు. అలాంటి దేశాలకు విజయం ఎప్పటికీ వరించదని సీడీఎస్ స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం పుణెలో జరిగిన ‘జై సే విజయ్’ సెమినార్ ప్రారంభోత్సవంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విక్టరీ అనేది కేవలం నినాదాలు, ప్రగల్భాల ద్వారా వచ్చేది కాదని.. అది నిరూపించగలిగిన ఆధారాల ద్వారా కనిపించాలని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ లోని పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని.. అయినా ఆ దేశం విజయం సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.

పాకిస్థాన్ పై జరిపిన ఆపరేషన్ సింధూర్ లో 13 పాకిస్థానీ ఎయిర్ బేస్ లు ధ్వంసం అయ్యాయని.. అలాగే అనేక టెర్రర్ క్యాంప్ లను నేలమట్టం చేసినట్లు.. వందలాది మంది ఉగ్ర మూకలను హతమార్చినట్లు సీడీఎస్ స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని.. ఆ దేశ రన్ వేలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను భారత సైన్యం నిర్వీర్యం చేసిందని ఆయన వివరించారు.

పాకిస్తాన్ విజయంపై CDS అనిల్ చౌహాన్ యొక్క బలమైన సందేశం భ్రమలో నివసిస్తున్న దేశాలకు రాదు

ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో భారత్ కొన్ని ఒడిదుడులకు లోనైన మాట వాస్తవమేనని.. కాకపోతే భారత వైమానిక దళం తన వ్యూహాలను మార్చేసి మే 10 కల్లా నిర్ణయాత్మక విజయాన్ని అందుకుందని సీడీఎస్ పేర్కొంది. ఇక ఏప్రిల్ 22 న జమ్ముకాశ్మీర్ లోని పల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

Source link