seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 11:06 am Digital Edition : SEEMA KIRANAM

పాకిస్థాన్ కు బ్యాడ్ న్యూస్..! | రాఫెల్ ఇండియా ఓకేస్ 114 ఫైటర్ జెట్స్ ప్రత్యర్థులకు బ్యాడ్ న్యూస్, రక్షణ బలానికి భారీ విజయం

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మే 7-10 మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలు ఏంటో పాకిస్థాన్‌తోపాటు ప్రపంచ దేశాలకు అర్థమైంది. భారత్ క్షిపణులు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. అలాగే పాక్ లోని పలు ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ అట్టుడికిపోయింది. భారత్ వైమానిక శక్తి ముందు పాకిస్థాన్.. చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. దాంతో భారత వైమానిక దళం ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలను అబ్బురపరిచాయి.

అయితే భారత్ ఇప్పటికే అనేక అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. కానీ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ భారత ఆయుధ సంపత్తిలో మరో కీలక అడుగు పడింది. గతంలో ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సుమారు రూ. 3.25 లక్షల కోట్లతో 114 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది.

తాజాగా మంత్రి గ్రీన్ సిగ్నల్ అందినట్లు రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ సమాచారం ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ పై రఫెల్ ఫైటర్ జెట్స్ చేసిన విధ్వంసం. ఈ యుద్ధ విమానాలు ఏకంగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు చేరుకోవడంతో ఆ దేశం వెన్నులో వణుకు పుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా 114 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం మరో ఆమోదం తెలిపిన పాకిస్థాన్ అప్రమత్తమైంది.

ఇక ఇప్పటికే భారత వైమానిక దళం వద్ద 36 రఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. తాజాగా మరో 114 డెలివరీ పూర్తయితే.. భారత అమ్ములపొదిలో ఈ రఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 150కి చేరుతుంది. దాంతో భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వీటితో పాటు భారత నావికాదళం కోసం 6 దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాలు, పీ- 8ఐ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతులు ఇచ్చింది.

రాఫెల్ ఇండియా ఓకేస్ 114 ఫైటర్ జెట్‌లు ప్రత్యర్థులకు బ్యాడ్ న్యూస్ రక్షణ బలానికి భారీ విజయం

రఫెల్ యుద్ధ విమానాల విశేషాలు చూస్తే.. రఫెల్ ఫైటర్ జెట్స్ ను ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. ఇవి అత్యంత శక్తిమంతమైన 4.5 జనరేషన్ మల్టీరోల్ యుద్ధ విమానాలు. ఇవి ఒకే సమయంలో గగనతలం నుంచి గగనతలంలోకి అలాగే గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఇవి గంటకు సుమారు 2,222 కి. మీ వేగంతో నిద్రగలవు. అలాగే ఈ యుద్ధ విమానాల ప్రయాణ పరిధి 3,700 కి. మీ గా ఉంది.

Source link