అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది. అదే సమయంలో అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రం అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మందిపైగా గాయపడ్డారు. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ ధృవీకరించారు. వందలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక టీవీ ఛానెల్‌లు కూడా ఈ ఫుటేజీని ప్రసారం చేశాయి. డ్రగ్స్ రిహాబిలిటేషన్ పై దాడి జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా. దాడి సంభవించిన వెంటనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం, శిథిలాల నుండి బాధితులను రెస్క్యూ సిబ్బంది తరలించడం ఈ వీడియోల్లో రికార్డ్ చేయబడింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిలిం చెప్పారు. 2,000 పడకల ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఈ ఘటనలో 400 మంది మరణించారు, దాదాపు 250 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు.
బ్రేకింగ్: ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రతినిధి ప్రకారం, కాబూల్‌లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని తాకిన పాకిస్తానీ వైమానిక దాడులకు సంబంధించిన మరిన్ని వీడియోలు పేర్కొనబడలేదు.
పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది, వారు “సైనిక… pic.twitter.com/GtRmnicTLW
— యల్దా హకీమ్ (@SkyYaldaHakim) మార్చి 16, 2026
దీన్ని పాకిస్థాన్‌ను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించారు. ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్థాన్ చెబుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార ప్రతినిధి మొషరఫ్ జైదీ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలుగా అభివర్ణించారు. పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దాడులు అత్యంత ఖచ్చితమైనవని, సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యమని స్పష్టం చేసింది. పౌరులపై ఎటువంటి దాడులు జరగలేదని వివరించింది.
ఆంగ్ల సారాంశం
ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ హాస్పిటల్ స్ట్రైక్‌లో 400 మంది మరణించారు మరియు 250 మంది గాయపడ్డారు, ఇస్లామాబాద్ ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించారు మరియు దాదాపు 250 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి మంగళవారం తెల్లవారుజామున తెలిపారు.