seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 4:31 am Digital Edition : SEEMA KIRANAM

పసిడి ధరలు మసకబారుతున్నాయ్.. !! | యుఎస్ ఎంప్లాయ్‌మెంట్ డేటా బూస్ట్ సెంటిమెంట్ తర్వాత బంగారం ధరలు ఈరోజు రూ.1.58 లక్షల దిగువకు పడిపోయాయి.

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

జనవరి నెలకు సంబంధించి అమెరికాలో అంచనాలను మించి బలమైన నాన్‌ఫార్మ్ పెరోల్స్ డేటా విడుదలైన తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈ సంఘటన బుధవారం వెలువడ్డాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చనే అంచనాలు మసకబారినట్టయింది. ఇది బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. మున్ముందు వీటి రేట్లు మరింత తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, కోమెక్స్.. రెండింట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,980 వద్ద. బుధవారం నాటి ముగింపుతో 0.49 శాతం తక్కువ. అదే సమయంలో కోమెక్స్ (కామెక్స్)లో ఔన్సు బంగారం ధర 5,028 వద్ద ట్రేడ్ అయింది. ఇందులో కూడా క్షీణత కనిపించింది. సుమారు 0.31 శాతం మేర తగ్గింది.

యుఎస్ ఎంప్లాయ్‌మెంట్ డేటా బూస్ట్ సెంటిమెంట్ తర్వాత బంగారం ధరలు నేడు రూ. 1 58 లక్షల దిగువకు పడిపోయాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,928, 22 క్యారెట్లు – రూ. 14,600, 18 క్యారెట్లు – రూ. 12,600

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు – రూ. 11,880

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు – రూ. 11,880

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు – రూ. 11,880

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు – రూ. 11,880

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు – రూ. 11,880

ఆంగ్ల సారాంశం

బలమైన US డాలర్ మధ్య అంతర్జాతీయ బులియన్ ధరలలో బలహీనత కారణంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం మరియు వెండి ధరలు గురువారం తక్కువగా ప్రారంభమయ్యాయి.

Source link