ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు NDAకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మహిళా రిజర్వేషన్లు.. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 2029 ఎన్నికలకు ఎన్డీఏ సిద్దం అవుతోంది. ఈ సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్‌గా మారుతున్నాయి. అందుకేనా.. బీజేపీకి మింగుడు పడని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పైన ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, పవన్ ను సైతం ఆ రెండు రాష్ట్రాల్లో కూటమి గెలుపు కోసం అభ్యర్ధుల కోసం బాధ్యత నిర్వహిస్తున్నట్లు సూచిస్తున్నారు.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై ఎన్డీఏ భారీ కసరత్తు చేస్తోంది. సెమీ ఫైనల్స్ గా
బీజేపీ నాయకత్వం మిత్రపక్షాలను పూర్తిగా ఈ ఎన్నికల కోసం సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అదే టైం లో తమిళనాడులో మిత్రపక్షాలతో అధికార పగ్గాలు చేపట్టాలంటే డీఎంకేతో పాటుగా విజయ్ – టీవీకే పార్టీ పైన గురి పెట్టింది. పశ్చిమ బెంగాల్ లో జాతీయ రాజకీయాల పైన పూర్తి అవగాహనతో పాటుగా.. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన ఏపీ సీఎం చంద్రబాబు సేవలను అక్కడ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఈ మేరకు బీజేపీ సీఎం చంద్రబాబుతో నేరుగా మాట్లాడేందుకు సిద్దమైనట్లు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిస్థితులు.. తెలుగు ఓటర్లు.. రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు ఢిల్లీ వర్గాల సమాచారం. మమతకు చెక్ పెట్టే విధంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ.. ఇందులో చంద్రబాబు సేవను వినియోగించుకునేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.
ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ 2021 లోనే విజయం కోసం బీజేపీ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసింది. అయినా, గెలుపు దక్కలేదు. దీంతో.. ఈసారి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అదే విధంగా తమిళనాడు, కేరళలోనూ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో రాష్ట్రం తమిళనాడు ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. అక్కడ ఎన్డీఏ కోసం పవన్ ను బరిలోకి దింపాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్‌కు ఎంత మేర తగ్గిస్తే అంత ఎన్డీఏకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
దీంతో, తమిళనాడులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు అక్కడ బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు. తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ గట్టి పట్టుదల మీద ఉంది. ఈ జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆయన సినీ గ్లామర్ తో పాటు ఆయన ఫైర్ బ్రాండ్ స్పీచ్ ని వాడుకోవాలని చూస్తారని సమాచారం.

