seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 12:33 pm Digital Edition : SEEMA KIRANAM

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

*పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*

 

*హైవే వంతెన పైనుంచి వాగులోకి దూసుకెళ్లిన కారు*

 

యడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.బెంగళూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైపు వెళ్తున్న ఓ కారు యడ్లపాడు హైవేపైకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అతివేగంతో ఉన్న కారు ముందు వెళ్తున్న ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు హైవే వంతెనపై ఉన్న రక్షణ గోడను ఢీకొట్టుకుంటూ నేరుగా కింద ఉన్నవాగులోకిదూసుకెళ్లింది.తండ్రీకొడుకులకు గాయాలుప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, ఆయన పదేళ్ల కుమారుడు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారితో పాటు ఆటో, బైక్‌పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడాగాయాలపాలయ్యారు.స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరు సమీపంలోని కాటూరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.