seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 5:02 am Digital Edition : SEEMA KIRANAM

పన్ను చెల్లింపునకు నాలుగు రోజులు

పన్ను చెల్లింపునకు మిగిలింది నాలుగు రోజులు

 

 ఆదివారం సైతం చెల్లించే వెసులుబాటు

 

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

 

కర్నూలు ప్రతినిధి ఏప్రిల్ 26, (సీమకిరణం న్యూస్):

 

నగరంలోని ఆస్తి పన్నుదారులు రాయితీలు పొందడానికి ఇక నాలుగు రోజులే మిగిలి ఉన్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ఆదివారం సైతం పాత, తాత్కాలిక కార్యాలయాలతో పాటు ప్రత్యేక కౌంటర్లలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పన్నులు చెల్లించవచ్చన్నారు. దండిగేరి, పెద్దపడఖాప 20,21వ సచివాలయాలు, బి.క్యాంపు, అరోరా నగర్ 56,57వ సచివాలయాలు, గురు రాఘవేంద్ర నగర్, రాజీవ్ గృహకల్ప 92,93వ సచివాలయాలు, కల్లూరు వార్డు కార్యాలయం 84,85వ సచివాలయాలు, లక్ష్మీనగర్, జెఎన్‌ఆర్ నగర్ 61,62వ సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు పనిచేస్తాయని కమిషనర్ పేర్కొన్నారు.