seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 10:54 am Digital Edition : SEEMA KIRANAM

పదవీ విరమణ.. కానీ సేవల జ్ఞాపకాలు చిరస్మరణీయం!

పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసులకు ఘన సన్మానం

 

సేవల్ని గుర్తుచేసుకున్న పోలీసు శాఖ.. శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేత

 

ముగ్గురు పోలీసు సిబ్బందిని ఘనంగా సన్మానించిన కర్నూలు పోలీసు శాఖ..

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 31, (మహా జ్యోతి న్యూస్) :

పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, సిబ్బందిని కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సై పి.ఎం. అలీఖాన్ (కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్), ఎ.ఎస్సై హెచ్.పి. ఫకృద్దీన్ (పత్తికొండ పోలీస్ స్టేషన్), హెడ్ కానిస్టేబుల్ జె. తిరుపాలు (పోలీస్ కంట్రోల్ రూమ్–కర్నూలు) ఉన్నారు. ఈ సందర్భంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పదవీ విరమణ పొందిన పోలీసులను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ తర్వాత ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారి సంక్షేమానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, పదవీ విరమణ పొందిన పోలీసుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.