seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 8:09 am Digital Edition : SEEMA KIRANAM

పంటల బీమా ప్రీమియం చెల్లింపు ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు

నాన్ లోనీ ఫార్మర్స్ కు(రుణం తీసుకోని రైతులకు) వాతావరణ పంటల బీమా ప్రీమియం చెల్లింపు ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు

 

లోనీ ఫార్మర్స్ కు (రుణం తీసుకున్న రైతులకు) ఇంతకుముందు ప్రకటించిన విధంగా జూలై 31 వరకు గడువు

 

పత్తి, వేరుశనగ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి

 

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

కర్నూలు ప్రతినిధి, జులై 17, (సీమకిరణం న్యూస్) :

 

నాన్ లోనీ ఫార్మర్స్ (రుణం తీసుకోని రైతులకు) వాతావరణ పంటల బీమా ప్రీమియం చెల్లింపు ఈ నెల 31 వరకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పత్తి, వేరుశనగ పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని, వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లోనీ ఫార్మర్స్ కు (రుణం తీసుకున్న రైతులకు) ఇంతకుముందు ప్రకటించిన విధంగా జూలై 31 వరకు గడువు ఉందని, వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతులు ఏ పంట వేసుకుంటే ఆ పంటకు మాత్రమే ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.