seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 2:25 am Digital Edition : SEEMA KIRANAM

నేడు కందుల కొనుగోలు కార్యక్రమం

ప్రభుత్వ మద్దతు ధరతో కందుల కొనుగోలు కార్యక్రమం

 

కందులు కొనుగోలు అధికారి షేక్షావలి.

 

వెల్దుర్తి, ఫిబ్రవరి 08, (సీమ కిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అయిన వెల్దుర్తి మండలంలోని రైతు సోదరులందరికీ తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వ మద్దతు ధరలో కందుల కొనుగోలు కార్యక్రమం మార్క్‌ఫెడ్/డీసీఎంఎస్ ద్వారా ఈరోజు నుండి అనగా(09-02-2026) సోమవారం నుండి యథావిధిగా ప్రారంభమగును. కనుక రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ మద్దతు ధరకు తమ కందులను అమ్ముకొనగలరు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుటకు శుభ్రపరిచిన కందులను తీసుకురావలసిందిగా కోరడమైనది.కందుల కొనుగోలు అధికారి,వెల్దుర్తి – షేక్షావలి సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9381004545