seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 5:24 am Digital Edition : SEEMA KIRANAM

నిర్ణయం మార్చుకున్న జగన్, ఇక అమీ తుమీ..!! | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మధ్య పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయంతో సిద్దమయ్యారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతుండటంతో పార్టీ వైఖరి ఖరారు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. పార్టీ రాజకీయ కార్యాచరణ.. ప్రభుత్వ నిర్ణయాల పైన నిరసనల పైనా జగన్ కొత్త ఆలోచన వంటి సమాచారం. ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడిస్తారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించి నిలదీసే విధంగా వ్యవహరించాలని ముఖ్యంగా జగన్ శాసనమండలి సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీకి హాజరు కాకపోవటం పైన పునరాలోచన ఉన్నాయి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావటంతో పాటు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మధ్య పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం, లడ్డూ వ్యవహారం, భూముల కేటాయింపు, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సభకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆలోచన ఉంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని భావిస్తే.. ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అక్కడే నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చి.. మాట్లాడాలని కొందరు సీనియర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

భవిష్యత్ కార్యాచరణ ఖరారు

అదే సమయంలో పార్టీ నేతల ఇళ్లపై దాడులు.. తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణంతో పాటు ఈసారి బడ్జెట్ పైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ నెల 14న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమయంలో సభకు వెళ్లాలని జగన్ ఆలోచన కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావటంతో.. ఇక, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పైన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయడం జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ఈ మేరకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమయంలో సభకు హాజరు పైన మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకోని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శాసనసభను బహిష్కరించి తమ నిరసనను తెలియచేస్తే ఎలా ఉంటుంది? అలాగే సభకు నిరసన తెలిపి వాకౌట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సీనియర్ నేతల సలహాలు తీసుకుని నేడు జగన్ ప్రకటించే అవకాశం ఉందని ప్రకటించారు.

ఆంగ్ల సారాంశం

అసెంబ్లీ సమావేశాల మధ్య ప్రభుత్వంపై కార్యాచరణ ఖరారు చేసేందుకు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

Source link