seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 9:17 pm Digital Edition : SEEMA KIRANAM

నితీష్ వారసుడు వచ్చేసారు, బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు..!! | పాట్నాలోని పార్టీ కార్యాలయంలో జేడీయూలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

భారతదేశం

-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ రాజ్యసభకు వెళ్లటం ఖాయమైంది. ఆయన స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోనుంది. ఇప్పటి కే ఈ ఒప్పందం జరిగింది. నితీశ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నితీష్ కుమారుడు నిశాంత్ తాజా ఎంట్రీ ఆసక్తి పరంగా మారుతోంది. నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం వేళ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకున్నారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం అయిన నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపిక కావటం లాంఛనమే. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు నడిపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీని నడిపించేందుకే నిశాంత్‌ను నితీష్ రాజకీయాల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. నిశాంత్ వయసు 50. సాధారణంగా నితీష్ కుమార్ లాంటి అగ్రనేత లు తమ వారసుల్ని చిన్న వయసులోనే రాజకీయాలకు తీసుకొస్తుంటారు. కానీ, నిశాంత్‌ను మాత్రం నితీష్ రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఇప్పటి వరకు నితీష్ వారసత్వ రాజకీయాల కు వ్యతిరేకమనే ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం నితీష్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రానికి వెళ్తుంది, తప్పనిసరిగా రాష్ట్ర బాధ్యతలు చూసేందుకు నిశాంత్‌ను పార్టీలోకి తీసుకువచ్చారు.

బీహార్-సీఎం-నిశాంత్-కుమార్-కొడుకు-నిశాంత్-కుమార్-జాయిన్-పాట్నా-పార్టీ-ఆఫీస్-లో-జేడు-నిశాంత్-పార్టీ-తీసుకున్నారు

వచ్చే వారం బీహార్ లో కీలక పరిణామాలు

జేడీయూలో చేరిన నిశాంత్‌కు బీహార్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందని. కాగా, నిశాంత్‌కు బిహార్ డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీలు అంటున్నాయి. మాట్లాడుతూ పార్టీని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని నిశాంత్ హామీ ఇచ్చారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన సొంత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం కోసం పనిచేస్తానని. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తర్వాత నితీష్‌ బిహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. తనతండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. 20ఏళ్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతండ్రి రాష్ట్రానికి ఎంతో పేర్కొన్నారు. బిహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.

ఆంగ్ల సారాంశం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ ఆదివారం జేడీ(యూ)లో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

Source link