seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 12:06 pm Digital Edition : SEEMA KIRANAM

నారా లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ

నారా లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ

‎ఏలూరు/ఢిల్లీ, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):

డిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో సమావేశయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో  ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో  ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రమంత్రులను కలిసి చర్చించాల్సిన అంశాలు, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు, నిధుల గురించి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్  భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్, నేవీ డిపో సహా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు ఎంపీ కార్యాలయం తెలియచేసింది.