seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 4:20 pm Digital Edition : SEEMA KIRANAM

త్యాగాలు ఉన్నా.. పార్టీ అభివృద్ధియే లక్ష్యం

త్యాగాలు ఉన్నా.. పార్టీ అభివృద్ధియే లక్ష్యం

 

 

టీడీపీ నాయకుడు ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ 

 

 

25 ఏళ్లకు పైగా పార్టీకే అంకితమైన కుటుంబం

 

 

కేసులు, ఆస్తుల నష్టం ఎదురైనా తగ్గని నిబద్ధత

 

 

 

 

 

 (కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, జూలై 24, (సీమకిరణం న్యూస్):

 

 

“గత 25 ఏళ్లకు పైగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకే అంకితభావంతో పనిచేస్తోందని నాటి నుంచి నేటి వరకు మా రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే కొనసాగుతోంది” అని వెల్దుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, టీడీపీ నాయకుడు ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ స్పష్టం చేశారు. వెల్దుర్తిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో కుటుంబ నేపథ్యం

మాజీ జడ్పీటీసీ ఈ.ఎల్. సంజన్న గౌడ్ నాయకత్వంలో నిరంతరం ప్రజాసేవ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. తమ పెద్దమ్మ దేవమ్మను టీడీపీ తరఫున సర్పంచ్‌గా, తండ్రి సంజన్న గౌడ్ను జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని గుర్తుచేశారు.

దేవమ్మ సర్పంచ్‌గా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్దుర్తి పర్యటనకు రావడం తమ కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు.

శివశంకర్ గౌడ్‌కు మద్దిలేటి స్వామి దేవస్థానం బోర్డు కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

 

నేతల విజయానికి కృషి & ప్రజా సంక్షేమం

 

మాజీ ఎమ్మెల్యేలు కేఈ ప్రభాకర్, కేఈ శ్యాంబాబుతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి విజయానికి తమ కుటుంబం విశేషంగా కృషి చేసిందన్నారు.

ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తనను వెల్దుర్తి సీహెచ్‌సీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా నియమించినప్పటి నుంచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశానని వివరించారు.

 

 

త్యాగాలు ఉన్నా.. పార్టీ అభివృద్ధియే లక్ష్యం

 

 

“పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేసులు ఎదుర్కొవడంతో పాటు ఆస్తులను కూడా కోల్పోయాం. అయినప్పటికీ టీడీపీ అభివృద్ధి కోసం మా సేవలు నిరంతరం కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం, ప్రజాసేవ లక్ష్యంగా పూర్తి సహకారం అందిస్తామని” ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ తెలిపారు.