Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణనకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు.. | sajjanar hyd cp హెచ్చరిక:...

నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు.. | sajjanar hyd cp హెచ్చరిక: మోసగాళ్లు SEO & ప్రకటనల ద్వారా ‘మాయాజాలం’ నకిలీ వెబ్‌సైట్‌లను ఎలా సృష్టిస్తారు – సురక్షితంగా ఉండండి!

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, తదితర రంగాలు దూసుకెళ్తున్నాయి. అయితే సాంకేతికత పెరిగిన వెంటనే ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. అయితే ఈ అలవాటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. సెర్చ్ కనిపించిన వెబ్ సైట్లలో అగ్రస్థానంలో ఉన్నంత మాత్రాన అది అసలైన, సురక్ష వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే మోసపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం మనకు అలవాటు. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లలో టాప్‌లో కనిపించే వెబ్‌సైట్‌లు లేదా ‘స్పాన్‌సర్డ్’ అని ఉన్న లింక్‌లు అన్నీ సురక్షితమైనవి కావని గుర్తించాలి. కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది.

నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం..

సైబర్ ముఠాలు ఇప్పుడు అధునాతన ‘సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్’ (ఎస్ఈఓ) సాంకేతికతను, పెయిడ్ యాడ్స్‌ను ఆసరాగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైన వాటిని పోలి ఉండే ‘ఫిషింగ్’ వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నాయి. వీటిని సెర్చ్ రిజల్ట్స్‌లో అగ్రస్థానంలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. వినియోగదారుల కస్టమర్ నంబర్ల కోసం లేదా పేమెంట్ సర్వీసుల కోసం వెతికినప్పుడు, ఈ నకిలీ లింకులు పైన కనిపిస్తాయి. అవి నిజమేనని నమ్మి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుంది.

వివరాలు ఇచ్చారో.. విలవిలలాడాల్సిందే..!

ఈ నకిలీ వెబ్‌సైట్లలోకి వెళ్లిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయమని అడుగుతారు. ఒకసారి మీరు ఆ ఇస్తే, క్షణాల్లో మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, మీ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి ‘ఐడెంటిటీ థెఫ్ట్’కు చేసే అవకాశం కూడా ఉంది.

Sajjanar hyd cp హెచ్చరించు మోసగాళ్ళు SEO amp amp ప్రకటనల ద్వారా మాజిక్ నకిలీ వెబ్‌సైట్‌లను ఎలా సృష్టిస్తారో సురక్షితంగా ఉండండి

రక్షణ మార్గాలు ఇవే..

యూఆర్‌ఎల్ చెక్ చేయండి. వెబ్‌సైట్ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. స్పెల్లింగ్ చిన్న తేడా ఉన్నా అది నకిలీదని గుర్తించాలి.. నేరుగా టైప్ చేయండి. సెర్చ్ ఫిర్యాదులలో వెతకడం కంటే, అధికారిక వెబ్‌సైట్ చిరునామా తెలిస్తే నేరుగా అడ్రస్ బార్‌లో టైప్ చేయడం సురక్షితం.. సెర్చ్ రిజల్ట్స్‌లో ‘స్పాన్సర్డ్’ లేదా ‘Ad’ అని ఉంటే వాటిని క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు అప్రమత్తత అవసరం. గుర్తుంచుకోండి.. ఆన్‌లైన్ ప్రపంచంలో అప్రమత్తతే మీకు రక్షణ కవచం!..” అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular