seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:48 am Digital Edition : SEEMA KIRANAM

నంద్యాల అదనపు ఎస్పీ చేతుల మీదుగా కర్నూలు రైల్వే స్టే హౌస్ ఘన ప్రారంభం

నంద్యాల అదనపు ఎస్పీ చేతుల మీదుగా కర్నూలు రైల్వే స్టే హౌస్ ఘన ప్రారంభం

 

కర్నూలు, జూలై 26 (సీమకిరణం న్యూస్):

కర్నూలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రైల్వే స్టే హౌస్ (రూమ్స్ & డార్మిటరీ) ను ఆదివారం సాయంత్రం నంద్యాల అదనపు ఎస్పీ శ్రీ ఎస్. ఖాదర్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి స్టే హౌస్‌ను ప్రారంభించి, గదులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వసతి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. స్టే హౌస్‌లో ఏసీ సింగిల్ రూములు, డబుల్ రూములు, డార్మిటరీ బెడ్లు, పరిశుభ్రమైన వాతావరణం, 24 గంటల సేవలు, భద్రతతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, జీఆర్పీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సిబ్బంది పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.