భారతదేశం
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->దేశంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే డిజిటల్ మోసాలను కట్టడి చేయటం పోలీసులకు పెద్ద కష్టంగా మారింది. ప్రజలలో అవగాహన కల్పిస్తున్నా సరే ఎక్కడో ఒక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ తాజాగా నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.
డిజిటల్ అరెస్ట్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి మరోసారి ప్రస్తావించారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలపై సమాజంలో ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది. అయితే ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతున్నాయి. ఇవి క్షమించరానివని, డిజిటల్ అరెస్టుకు, ఆర్థిక మోసానికి అమాయకులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా, అవగాహనతో చాలా ముఖ్యమన్నారు.

కేవైసీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
బ్యాంకు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కేవై- నో యువర్ కస్టమర్- పట్ల అప్రమత్తత ముఖ్యమైన అంశమని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఈ ప్రక్రియ అందరికీ తెలిసినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించారు. బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు తిరిగి- కేవైసీని కలిగి ఉన్నాయి.
కేవైసీ పేరుతో సైబర్ మోసాలు .. జాగ్రత్త
ఇదే అవకాశంగా నేరస్థులు నకిలీ కాల్స్ చేస్తారని, ఎస్ ఎం ఎస్, లింకులను పంపుతారని, అలాంటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మీకు వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని, అనుమానం ఉంటే నేరుగా బ్యాంకుకే వెళ్లి నిర్ధారించుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందేశాన్ని గమనించి,. కేవైసీని నవీకరించుకోవాలన్నారు. కేవలం బ్యాంక్ యాప్స్ లేదా బ్రాంచ్‌ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
పాస్వర్డ్స్ తరచూ మారుస్తూ జాగ్రత్తగా ఉండాలి
పాస్‌వర్డ్ చాలా కాలం పాటు ఒకే పాస్‌వర్డ్‌లు తరచూ మారుస్తూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలలో అప్రమత్తంగా ఉంటే అన్నిటి కన్నా ముఖ్యమని, కనుక ప్రజలు డిజిటల్ మోసాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా లేకుంటే మీ కష్టార్జితం సైబర్ నేరగాళ్ళ పాలు ప్రమాదం అవుతుందని ప్రధాని మోడీ ప్రకటించారు.
ఆంగ్ల సారాంశం
డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా PM మోడీ ప్రజలను హెచ్చరిస్తున్నారు. మన్ కీ బాత్‌లో, ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా పౌరులను హెచ్చరించారు, నకిలీ KYC అప్‌డేట్ కాల్‌లు లేదా సందేశాలను విశ్వసించవద్దని మరియు అధికారిక బ్యాంక్ యాప్‌లు లేదా శాఖలను మాత్రమే ఉపయోగించాలని వారికి సూచించారు.