Tuesday, March 10, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణదేశంలోనే టాప్ లో ఏపీలో అన్నదాతల అప్పులు.. కేంద్రం లెక్క ఇదే! | ఏపీ రైతులు...

దేశంలోనే టాప్ లో ఏపీలో అన్నదాతల అప్పులు.. కేంద్రం లెక్క ఇదే! | ఏపీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కేంద్ర గణాంకాల ప్రకారం రైతుల అప్పుల్లో ఏపీ రైతులు రెండో స్థానంలో ఉన్నారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

దేశంలో అన్నదాతల జీవన స్థితి ఎలా ఉంది? అన్నదాతలకు వ్యవసాయం లాభసాటిగా ఉందా? రైతుల రుణ భారం అసలేం చెప్తుంది? అనేది ప్రస్తుతం అందరూ అన్నదాతల గురించి ఆలోచించేలా చేస్తుంది. రైతులపై పెరుగుతున్న రుణ భారం పై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాల జాబితా.

అన్నదాతల అప్పులలో ఏపీ స్థానం ఇదే

కేంద్ర ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్ చౌదరి దేశవ్యాప్తంగా రైతుల అప్పులపై లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రైతుల రుణాల విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత స్థానంలో ఉందని పేర్కొన్నారు.కేంద్రం ప్రకారం 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై మొత్తం మూడు లక్షల 75 వేల 254 కోట్ల రూపాయల అప్పు అంచనా.

అప్పుల్లో ఏపీ రైతులు కేంద్ర గణాంకాల ప్రకారం రైతుల అప్పుల్లో రెండో స్థానంలో ఏపీ రైతులు

ఎక్కువ రైతు రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఏపీ

ఈ మొత్తం రుణంలో రెండు లక్షల వెయ్యి 744 కోట్ల పంట రుణాలు కాగా, మిగిలిన 1,73,510 కోట్లు టర్మ్ లోన్లుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువ రుణాలు తీసుకున్న దేశంలోనే పంటల కోసం రుణాలు తీసుకున్న రైతులు రెండవ స్థానంలో ఉన్నట్టు గుర్తించారు.

రైతులపై పెరుగుతున్న రుణభారం

తెలంగాణ రాష్ట్రంలో రైతుల పైన మొత్తం ఒక లక్ష 75 వేల 960 కోట్ల రుణ భారం ఉందని , ఇందులో 95 వేల 167 కోట్ల రూపాయల పంట రుణాల రూపంలో ఉండగా, 80,792 కోట్లు టర్మ్ లోన్ల కింద ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారం రైతులపై పెరుగుతున్న ఈ రుణభారం వ్యవసాయ రంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో మార్పులకు నిపుణుల సూచన

రైతుల ఆర్థిక ప్రగతికి సహాయపడే నిర్ణయాలను తీసుకుంటూ, వారికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే విధానాలను తక్షణమే వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular