భారతదేశం
-డాక్టర్ వీణా శ్రీనివాస్
బిజీ జీవితం నుంచి రిలీఫ్ బయటకు, ప్రశాంతంగా ఇష్టమైనవి తినడానికి చాలామంది రెస్టారెంట్లకు వెళుతూ ఉంటారు. లైట్ మ్యూజిక్ తో, ఆహ్లాదకర వాతావరణంలో రెస్టారెంట్లు జనాలకు స్వాగతం పలుకుతాయి. మనసుకు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు రెస్టారెంట్ల థీమ్ లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
దెయ్యాల రెస్టారెంట్
ప్రస్తుతం వారణాసిలోని కంకల్ హర్రర్ రెస్టారెంట్ ఒక వింతైన థీమ్ రెస్టారెంట్ గా అక్కడికి వెళ్ళిన వారితో కేకలు పెడుతోంది. కంకల్ హర్రర్ రెస్టారెంట్ దెయ్యాల థీమ్ తో ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌లో దెయ్యాలు, అస్తిపంజరాలు ,పుర్రెల తోటి డిఫరెంట్ స్టైల్లో ఏర్పాట్లు చేశారు,. ఇక కాదు ఈ రెస్టారెంట్‌లో మీకు భోజనం అందిస్తే వారు కూడా దెయ్యాల వేషధారణ లోనే ఉంటారు.

దెయ్యాలు, భూతల మధ్య భోజనం
మెడలో పుర్రెల మాలలు వేసుకొని బ్లాక్ కలర్ డ్రెస్సులు, ముఖానికి వైట్ కలర్ మాస్కులతో అచ్చం ఒక దయ్యాన్ని చూసిన ఫీల్ కలిగేలా రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు భోజనం వడ్డిస్తారు. అంతేకాదు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి భయభ్రాంతులకు కూడా గురిచేస్తారు. వారణాసిలో ఉన్న ఈ రెస్టారెంట్ ను సందర్శిస్తున్న చాలామంది ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతున్నారు.
దెయ్యాలను చూసి ఏడుస్తున్న కొందరు కస్టమర్ లు
బాగా డార్క్ ఫీల్డ్ ఉన్న రూమ్ లో నిర్వహించబడుతున్న ఈ రెస్టారెంట్ అక్కడికి వచ్చిన వారికి సడన్ గా వచ్చే దెయ్యాలతో షాకింగ్ ఫీల్ కలిగిస్తుంది. కొంతమంది అయితే ఈ రెస్టారెంట్ కి వచ్చి ఆ దయ్యాలను చూసి ఏడుస్తున్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ కి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రశాంతంగా తినక ఈ కేకలేందిరా సామీ.. నెటిజన్ ల సెటైర్లు
ఇక ఇదంతా చూసిన నెటిజన్లు ప్రశాంతంగా తినకుండా ఈ కేకలు ఏందిరా సామి అంటూ సెటైర్లు వేస్తున్నారు. భోజనం చేసే చోటు ప్రశాంతంగా ఉండాలి కానీ, ఈ దెయ్యాలు, భూతాలు గొడవేంటి అని నవ్వుకుంటున్నారు. మరీ ఇంతలా భయపెడితే తినకుండా పారిపోతారేమో అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎవరైనా ఒంటరిగా ఇక్కడ తినడానికి వస్తే దెయ్యాలను చూడగానే ఆకలి కాస్త చచ్చిపోతుంది అంటూ మరికొందరు చూస్తున్నారు.
ఫుడ్ ఆస్వాదించాలంటే ఇలాంటి రెస్టారెంట్ అవసరమా?
ఇంకొందరు ఇక్కడికి తినడానికి వచ్చారా లేక భయంతో చావడానికి వచ్చారా అంటూ ఈ వీడియోలు చూసి వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెళ్తే పబ్లిసిటీ బాగా జరుగుతుందని ఫీలైన రెస్టారెంట్ ఓనర్ చేసిన ప్రయోగం బాగానే ఉంటుంది, మరీ పిరికి వాళ్ళు ఉంటే లేనిపోని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దెయ్యాలతో భయపెట్టే ఈ ఫియర్ రెస్టారెంట్ కంటే ప్రశాంతంగా ఫుడ్ ని ఆస్వాదించే రెస్టారెంట్లకు వెళ్లి తినడం మంచిది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

