Tuesday, March 10, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణదారుణం: అత్తకి యముడు.. అమ్మాయికి మొగుడు !! | నాగర్‌కురూల్‌లో అల్లుడు భార్య అత్తపై శారీరకంగా...

దారుణం: అత్తకి యముడు.. అమ్మాయికి మొగుడు !! | నాగర్‌కురూల్‌లో అల్లుడు భార్య అత్తపై శారీరకంగా దాడి చేసి హత్య చేసిందని హత్య వార్త

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-కొరివి జయకుమార్

సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే.. మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగయ్యాయని అనిపిస్తుంది. ఏ మాయ రోగం వచ్చిందో తెలీదు కానీ మనుషులు మనుషులు అని మర్చిపోతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా పారు చేస్తున్న కిరాతకపు ఘటనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఓ పక్క పెళ్లి అయిన వారు.. మరో పక్క పెళ్లి కాని వారు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా తమ భాగస్వామిని కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపుతున్నారు. మరి కొంతమంది మృగాళ్లు అయితే వావివరసలు మర్చిపోయి కొంత మంది మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు . తల్లి, చెల్లి, వదిన అనే తేడాలేకుండా దారుణాలకు గురవుతున్నారు.

పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు మగాళ్లను చూస్తుంటే మహిళలకు అసలు రక్షణ ఉందా అనే అనుమానం సర్వత్రా అనుమానం కలిగిస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో ఈ తరహా దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాగు కోసం అల్లుడుని ఇల్లరికం తెచ్చుకుంటే.. చివరకు ఆ కిరాతకుడు అత్తకి యముడిగా మారాడు. మద్యం మత్తులో ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది.

నగర్‌కూరుకు శారీరకంగా దాడి చేసి అత్తగారిని హత్య చేసిన అల్లుడు-భార్య హత్య..

అసలేం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు సంతానం. ఒక కూతురికి కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే కొన్నిరోజులు వారి కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అల్లుడు తాగుడుకు బానిసగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఎలాంటి ఉద్యోగం లేకుండా రోజు తప్పతాగి కూతుర్ని వేధిస్తున్నప్పుడు కూతురు బాగు కోసం అతడ్ని ఇల్లరికంగా తెచ్చుకుంది.

అయితే ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇక భర్తను భరించలేని భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటికే తప్పతాగి ఉన్న అల్లుడు.. అత్తను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమో అనే అనుమానంతో తీవ్రంగా కొట్టి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి పారిపోయిన సమాచారం.

స్థానికులు పెద్ద శబ్దాలను గమనించి ఇంటికి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular