Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి

ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి 

 

 

టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలి

 

 

టైలర్స్ యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప, రసూల్ భాష

 

పింఛన్, చేధోడు పునరుద్ధరణ, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వానికి కీలక డిమాండ్లు

 

 

వెల్దుర్తిలో ఘనంగా ప్రపంచ టైలర్స్‌ దినోత్సవ వేడుకలు

 

 వెల్దుర్తి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్):

 

ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వెల్దుర్తి మండలంలోని టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలని వెల్దుర్తి టైలర్స్ యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప, రసూల్ భాష అన్నారు. వెల్దుర్తి పట్టణంలోని టైలర్స్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా ప్రపంచ టైలర్స్‌డే వేడుకలను నిర్వహించారు. వెల్దుర్తి టైలర్స్‌ అందరూ కలిసి కుట్టుమిషన్‌ రూపకర్త విలియమ్స్‌ హౌవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో టైలర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక డిమాండ్లు చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప, రసూల్ మియా, ఉస్మాన్ భాష మాట్లాడుతూ టైలర్ల జీవన పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, పనుల కొరత, ఆధునిక యంత్రాల పోటీ కారణంగా సంప్రదాయ టైలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం టైలర్ వృత్తిని గుర్తించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. 40 సంవత్సరాలు దాటిన టైలర్లకు ప్రత్యేక పింఛన్ మంజూరు చేయాలని, గత ప్రభుత్వంలో అమలు చేసిన చేధోడు పథకాన్ని తిరిగి పునరుద్ధరించి రూ.20,000 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అదేవిధంగా టైలర్ షాపులకు ఉచిత విద్యుత్ సరఫరా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టైలర్లకు ప్రభుత్వ మద్దతు అత్యవసరమని, లేనిపక్షంలో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ యూనియన్ నాయకులు మహమ్మద్, షఫీ, రాజు, బజార్, భాష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular