Monday, March 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ | ట్రంప్ శాంతి వాదనలను ఇరాన్...

తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ | ట్రంప్ శాంతి వాదనలను ఇరాన్ ఖండించింది: “యుఎస్‌తో చర్చలు లేవు, ప్రతీకార భయంతో ట్రంప్ వెనక్కి తగ్గారు”

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయి-లింగారెడ్డి గజ్జల

మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగిపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇరాన్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన “ఐదు రోజుల విరామం”, “ఉత్పాదక చర్చలు” అన్నీ ఒట్టి భ్రమలని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వాషింగ్టన్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని, ట్రంప్ తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ఈ ‘చర్చల’ డ్రామా ఆడేందుకు టెహ్రాన్ ఆరోపించింది.

తొకముడిచిన ట్రంప్? ఇరాన్ వెర్షన్ ఇదే!

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అనుబంధ మీడియా సంస్థ ట్రంప్ ప్రకటనను ఎద్దేవా చేస్తోంది. ఇరాన్ చేసిన “బ్లాక్ అవుట్” హెచ్చరికలకు అగ్రరాజ్యం వణికిపోయిందని, అందుకే దాడుల నుంచి వెనక్కి తగ్గిందని తెలిపింది.

అమెరికాతో చర్చలు లేవని ట్రంప్‌ శాంతి వాదనలను ఇరాన్ ఖండించింది, ప్రతీకార భయంతో వెనక్కి తగ్గింది.

ప్రతీకార భయం..

ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు మరియు మిత్రదేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామన్న ఇరాన్ హెచ్చరికలే ట్రంప్‌ను ఆలోచనలో పడేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయంగా జరుగుతున్న చర్చల నుంచి దృష్టి మళ్లించడానికి, తన వైఫల్యాన్ని సమర్థించుకోవడానికి ట్రంప్ ‘సమయం’ కొంటున్నారని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది.

ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా.. చావుదెబ్బ కొడుతుందా?

ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ తన పట్టు సడలించడం లేదు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత పెంచే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలపై ఇరాన్ తన ప్రతీకార దాడులను మరింత ముమ్మరం చేయవచ్చు. ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాలోని కీలక మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికా ఇరకాటంలో పెట్టాలని టెహ్ యోచిస్తోంది.

అగ్రరాజ్యం పరువు గంగలో కలిసినట్టేనా?

అల్టిమేటం ఇచ్చి, డెడ్ లైన్ విధించిన తర్వాత ట్రంప్ ఇలా వెనక్కి తగ్గడం అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. “ఆర్ట్ ఆఫ్ ది డీల్” అని చెప్పుకునే ట్రంప్, ఇరాన్ ముందు తలవంచారా? లేక ఇది ఇరాన్‌ను బుజ్జగించి లోబర్చుకోవడానికి వేసిన రహస్య ఎత్తుగడ? అన్నది అస్పష్టంగా ఉంది. అయితే, ఇరాన్ మాత్రం తన ‘ఈగో’ను సంతృప్తి పరుచుకుంటూ, అగ్రరాజ్యాన్ని మరింత సవాలు చేస్తోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular