భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త ఇది. రెండు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న 70 రైళ్లకు గతంలో ప్రయోగాత్మకంగా ఇచ్చిన తాత్కాలిక హాల్ట్‌లను మరికొంతకాలం పొడిగిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.
తిరుపతి-బిలాస్ పూర్ మధ్య (17482,17481) రైళ్లు, పూరీ-తిరుపతి మధ్య (17479,17480) రైళ్లకు కొవ్వూరులో ఇచ్చిన హాల్ట్ కొనసాగుతోంది. అలాగే పుదుచ్చేరి నుంచి హౌరా మధ్య రాకపోకలు సాగించే (12868,12867)రైళ్లకు, భువనేశ్వర్ -రామేశ్వరం మధ్య రాకపోకలు సాగించే (20849, 20850) రైళ్లకు రాజమండ్రిలో ఇచ్చిన హాల్ట్ కూడా పొడగించారు. అలాగే యశ్వంత్ పూర్-మచిలీపట్నం రైలు నంబర్ 17212కు కంభంలో, ధర్మవరం-విజయవాడ రైలు నంబర్ 17216కు గిద్దలూరులో, చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైలు నంబర్ 17643, లింగంపల్లి నుంచి నరసాపురం వెళ్లే రైలు నంబర్ 17256కు మంగళగిరిలో హాల్ట్ లు పొడిగించారు.

అలాగే ధర్మవరం-విజయవాడ రైలు నంబర్ 17216కు మార్కాపూర్ రోడ్డులో, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ రైలు నంబర్ 12603కు, తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నంబర్ 12733కు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు నంబర్ 17015కు మిర్యాలగూడలో హాల్ట్ లు పొడిగించారు. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు నంబర్ 12603, తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నంబర్ 12733కు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు నంబర్ 17015కు నడికుడిలో హాల్ట్ లు పొడిగించబడ్డాయి. వీటితో పాటు చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 12603, భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు నంబర్ 17015, నరసాపురం నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు 17255కు నల్గొండలో స్టాప్ పొడిగించారు.
చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైలు 17643కు న్యూ గుంటూరు స్టేషన్‌లో, చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 12603, భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు నంబర్ 17015, తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నంబర్ 12733కు పిడుగురాళ్లలో హాల్ట్ పొడిగించారు. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 12603, భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు నంబర్ 17015కు సత్తెనపల్లిలో స్టాప్ పొడిగించారు. కాచిగూడ-రేపల్లె రైలు 17625కు వేజెండ్లలోనూ స్టాప్ పొడిగించారు. నాగర్ సోల్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ 17232కు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ, మిర్యాలగూడలో స్టాప్ లు కూడా పొడిగించారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే రైళ్లు (20701, 20702)కు రామన్నపేటలో హాల్ట్ పొడిగించారు. సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రైళ్లు (17645, 17646)కు సిరిపురంలో స్టాప్ పొడిగించారు. తిరుపతి-హెచ్.నిజాముద్దీన్ మధ్య నడిచే రైళ్లు (12707, 12708)కు రాజంపేటలో స్టాప్ పొడిగించారు. అలాగే ఎల్టీటీ ముంబై-కరైకల్ మధ్య నడిచే రైలు 11017కు గుత్తి, తాడిపత్రిలో హాల్ట్ లు పొడిగించారు. యశ్వంత్ పూర్-లక్నో రైలు 22683కు అనంతపురంలో, ఎల్టీటీ ముంబై-మధురై రైలు 22101కు గుత్తిలో, కేఎస్ఆర్ బెంగళూరు-హెచ్ఎస్ నాందేడ్ మధ్య నడిచే రైళ్లు (16593,16954)కు నగరూర్ లో హాల్ట్ లు పొడిగించబడ్డాయి. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే రైళ్లు (12706,12705))కు సైతం నెక్కొండలో స్టాప్ పొడిగించారు.

చెన్నైసెంట్రల్-అహ్మదాబాద్ మధ్య నడిచే రైళ్లు (12655,12656)కు పెద్దపల్లిలో స్టాప్ పొడిగించారు. చెన్నై సెంట్రల్-హెచ్ నిజాముద్దీన్ రైలు 12611కు వరంగల్ లో, ఎర్నాకుళం టౌన్-పాట్నా రైలు 22699కి ఖమ్మంలోనూ, రాక్సౌల్-హైదరాబాద్ మ్య నడిచే రైళ్లు (17005, 17006)కు పెద్దపల్లిలో, హెచ్‌హెచ్ నిజాముద్దీన్-తిరుపతి మధ్య రాకపోకలు 127 ర్యాకప్‌పల్లిలో ర్యాకపోకలు పొడిగించారు. సికింద్రాబాద్-మణుగూరు మధ్య నడిచే రైళ్లు (12745,12746)కు గార్లలో, నాగ్ పూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు (20101, 20102)కు మంచిర్యా, సిర్పూర్ కాగజ్ నగర్‌లో స్టాప్‌లు పొడిగించబడ్డాయి. అలాగే తిరుపతి-నిజామాబాద్ రైలు 12793కు నవాండ్ గీలో, గుంటూరు-ఔరంగాబాద్ మధ్య నడిచే రైళ్లు (17253, 17254)కు పంగావ్ లో, సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే రైళ్లు (12714,12713)కు జనగాంలో హాల్ట్ లు పొడిగించారు.