Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు | శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించినందున...

తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు | శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించినందున తెలంగాణతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-చంద్రశేఖర్ రావు

రాష్ట్రపతి భవన్ రాష్ట్రాల గవర్నర్లను పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. లోక్ భవన్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తరచూ ఘర్షణ చోటు చేసుకునే పశ్చిమబెంగాల్, తమిళనాడులకూ కొత్త గవర్నర్లు నియమితులయ్యారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ రాజీనామాను ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి కొత్త నియామకాలకు, బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ మార్పులు- ఆయా రాష్ట్రాల గవర్నర్లు తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ మధ్యకాలంలో గవర్నర్ల బదిలీల్లో చోటు చేసుకున్న అతిపెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.

శివ ప్రతాప్ శుక్లా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో తెలంగాణతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలంగాణకు బదిలీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అత్యంత కీలకమైన మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. నంద్ కిషోర్ యాదవ్.. నాగాలాండ్‌కు కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ గా పని చేశారాయన. ప్రస్తుతం నాగాలాండ్ కు గవర్నర్ అంటూ ఎవరూ లేరు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నాగాలాండ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

తన పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద బోస్ స్థానంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆర్‌ ఎన్ రవి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్ ఎన్ రవి స్థానంలో తమిళనాడు గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్ బాధ్యతలను స్వీకరిస్తారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న రెండు అత్యంత కీలకమైన రాష్ట్రాలు. పలు సందర్భాల్లో అక్కడి బీజేపీయేతర ప్రభుత్వాలను బాహటంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.

శివ ప్రతాప్ శుక్లా తెలంగాణకు బదిలీ కావడం వల్ల ఏర్పడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కోసం కవీందర్ గుప్తా భర్తీ చేయనున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. లఢక్ లెప్టినెంట్ గవర్నర్ గా వ్యవహరించారు. బీహార్ కొత్త గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత హస్నైన్ (రిటైర్డ్) నియమితులయ్యారు. ఆయన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నుండి బాధ్యతలు స్వీకరిస్తారు.

కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా బదిలీ అయ్యారు. ఆయన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular