seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:18 am Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణ ‘మినీ మాల్దీవులు’ చూసొద్దామా..? తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ట్రిప్..! | తెలంగాణకు చెందిన సోమశిల మినీ మాల్దీవులు: నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమశిల యొక్క ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ ఎస్కేప్

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాల్దీవులకు వెళ్లాలని చాలామందికి కోరికగా ఉంటుంది. కానీ ఆ ప్రాంతం చాలా దూరం కాబట్టి వెళ్లలేక పోతారు. అయితే మనకు దగ్గరలో తెలంగాణలో మినీ మాల్దీవులుగా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా..? తెలంగాణలోని ఈ పర్యటక కోసం వెళ్తే సేమ్ మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. నల్లమల అడవుల్లో దాగిన ఈ అద్భుతమైన దృశ్యం ఎలా చేరుకోవాలి..? తక్కువ బడ్జెట్ లో తెలంగాణ మినీ మాల్దీవుల టూర్ ఎలా చేయాలి..?

చుట్టూ ఎటు పచ్చదనంతో పలుకుతున్న అడవి.. ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు.. మరో ఎత్తయిన కొండలు.. వాటి నడుమ అందమైన జలపాతాలు.. ఇలా ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఎక్కడో లేదు తెలంగాణలోనే దాగి ఉంది. ఈ ప్రాంతం ఇప్పుడు చూపులను కనువిందు చేస్తోంది. కాస్తంత విరామం దొరికితే.. పర్యాటక ప్రియులు కుటుంబసమేతంగా చూడదగ్గ ప్రదేశంగా మారింది.

అదే తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ దాని ‘సోమశిల’ ప్రాంతం. ఈ పర్యాటక ప్రదేశం హైదరాబాద్ నుంచి కేవలం 180 కి. మీ దూరంలోనే ఉంది. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులకు మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్‌ను కచ్చితంగా కలుగుతుంది. ఇక హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే సోమశిలకు చేరుకోవచ్చు. ఇక్కడి కృష్ణా నదిలో బోటింగ్ కూడా చేసే వీలుంది. అలాగే ఇక్కడి ప్రత్యేకమైన చేపల వంటకాలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణ సోమశిల మినీ మాల్దీవులు నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమశిల నిర్మలమైన బ్యాక్ వాటర్స్ ఎస్కేప్

సోమశి పర్యటనకు వచ్చే పర్యాటకులకు తెలంగాణ టూజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇక్కడే టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే టూరిస్టులు తమకు వీలుగా బస చేయటానికి కాటేజీలను నిర్మించారు. ఇక కృష్ణా బ్యాక్ వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు సోమశిల నుంచి బోటింగ్ ద్వారా శ్రీశైలానికి చేరుకోవచ్చు. ఇక సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి టూరిజం డిపార్ట్ మెంట్ నుండి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే సొంత వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.

Source link