తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ స్టేట్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది.
తెలంగాణా తిరుపతికి కొత్త మార్గం
తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది.

ఎన్ హెచ్ 565 నిర్మాణంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
గతంలో మార్కాపురం ఏర్పాటు ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది.
రహదారి విస్తరణకు అడ్డ అనుమతుల జాప్యంతో
NH565 లోని 20 రహదారి విస్తరణకు వంటి అనుమతుల జాప్యం అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
209 ఈ రహదారి నిర్మాణం కోసం 33 కోట్ల రూపాయల ఖర్చు
గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 209 ఈ రహదారి నిర్మాణం కోసం 33 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సమీపంలోని మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి.
ఈ ప్రాంతాలుగా రహదారి
మొత్తం 420 పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం ఈజీ అవుతుంది.
ఆంగ్ల సారాంశం
తెలంగాణ నుండి తిరుపతి ఎన్హెచ్ 565 సిద్ధంగా ఉంది. జాతీయ రహదారి 565 ఇప్పుడు అమలులో ఉంది, తెలంగాణలోని నకిరేకల్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు సాఫీగా ఉండే మార్గాన్ని అందిస్తుంది, వేలాది మంది భక్తులు మరియు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.