తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం విడత జరిగే ఇళ్ల గణన రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభ తేదీ జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ప్రకటించారు.
అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్పు కోసం కేబినెట్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇకపై ప్రభుత్వ పరిధిలోకి TVVP ఉద్యోగులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కు ప్రతి జిల్లాలో భూకేటాయింపునకు ఆమోదం లభించింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం లభించింది. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల కేటాయింపునకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

మరోవైపు మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, మార్చి 17, మార్చి 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండనుంది. అలాగే మార్చి 20వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోటోలు చూపిస్తుంది. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.