seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 4:43 am Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణా రైతులకు సర్కార్ తీపి కబురు.. ఆ డబ్బులు జమ! | రైతులకు శుభవార్త.. తెలంగాణ ఖరీఫ్ 2025-26 వరి సేకరణ పూర్తయింది రూ.500 బోనస్ జమ

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న రేవంత్ సర్కార్ తాజాగా పెండింగ్‌లో ఉన్న సన్న వడ్ల బోనస్ మొత్తాలను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేసింది. ఖరీఫ్ దానం కొనుగోలు ముగిశాయని, రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

సన్నబియ్యం సాగు చేసిన రైతులకు బోనస్

2025- 2026 వానకాలం సీజన్‌లో 2.17లక్షల మంది అన్నదాతలు సన్న బియ్యం వరి సాగు చేశారు. ఖాతాలలో 514. 36 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏ సన్నరకం ధాన్యానికి ప్రభుత్వానికి క్వింటాలుకు 2389 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 రూపాయల బోనస్ అందించింది.

రైతులకు శుభవార్త తెలంగాణ ఖరీఫ్ 2025-26 వరి సేకరణ పూర్తయింది రూ. 500 బోనస్ జమ చేయబడింది

సన్న వడ్లను విక్రయించిన 7.49 లక్షల మంది రైతులు

దీంతో రైతుల ఖాతాలకు క్వింటాలుకు మొత్తం 2,889 రూపాయలు జమయ్యాయి. తమ ఖాతాలను ఈ మేరకు చెక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న వడ్లను విక్రయించారు. అయితే సోమవారం నాటికి 99.25 శాతం మందికి 1939. 58 కోట్లు బోనస్ గా అందినట్లు ప్రభుత్వం.

త్వరలో ఆ డబ్బులు కూడా విడుదలయ్యాయి

మిగిలిన 14.62 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. ఇందులో సన్న రకం వడ్లు 39.08 లక్షల టన్నులు కాగా, ధాన్యం 32.78 లక్షల టన్నులు. ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరగడంతో కొనుగోలు కేంద్రాలకు కూడా భారీగా సన్నరకం ధాన్యం వచ్చింది.

రైతుల ఖాతాల్లో అదనంగా క్వింటాలుకు 500రూపాయలు

రాష్ట్రవ్యాప్తంగా 8448 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి బియ్యాన్ని సేకరించారు. ఈ సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నులను పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాములలో నిలువ చేసింది. మొత్తంగా సన్న బియ్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఈ మేరకు వారికి డబ్బులను విడుదల చేస్తూ సన్న బియ్యం సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

ఆంగ్ల సారాంశం

తెలంగాణ రైతులకు శుభవార్త. సాధారణ రకానికి MSP అందించబడింది మరియు చక్కటి రకానికి ₹500 బోనస్ క్రెడిట్ చేయబడింది. 7.49 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు జరిగాయి.

Source link