తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. టి జి ఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మరోమారు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేటం అందజేశారు. ఈ మేరకు నేడు బస్ భవన్ లో ఆర్టీసీకి నేతలు సమ్మె నోటీసులు జారీ చేశారు. అనంతరం లేబర్ కమిషనర్ కూడా సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీ సమ్మె తేదీ పైన 14రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల అల్టిమేటం
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయం అంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేయడంతో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరికలు జారీ చేశారు. కార్మిక సంఘాలు చెబుతున్న ప్రకారం ఉద్యోగులు, కార్మికులు అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
ట్రేడ్ యూనియన్ల పైన ఆంక్షలు విధించడం వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదు. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2021 వేతన సవరణ 30% ఫిట్‌మెంట్ అమలు చేయబోతున్నారు.
ఉద్యోగ భద్రత కోరుతున్న కార్మికులు
మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా 350 కోట్లు కోత లేకుండా, పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు అడుగుతున్నారు. ట్రేడ్ యూనియన్ల పైన ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని అంటున్నారు.
అధిక పని భారం తగ్గించాలని డిమాండ్
అన్ని కేటగిరీలలో పనిచేసే ఉద్యోగులపై అధిక పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ డిమాండ్లను పరిష్కరించుకుంటే సమ్మె చేసి తీరుతామని, ఆందోళనలను మరింత ఉధృతం చేశామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
ఆంగ్ల సారాంశం
TGSRTC వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంతో TGSRTC సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూ జేఏసీ నేతలు బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు.