seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 7:14 am Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణాలో బాలికల కోసం ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సిన్.. పేరెంట్స్ మర్చిపోవద్దు! | తెలంగాణలో పెరుగుతున్న కేన్సర్ కేసులు.. 15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసి పనులు చేస్తోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పైన దృష్టి సారించి నిర్ణయం తీసుకుంది. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల కోసం కేంద్రంతో కలిసి ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందించడానికి సిద్ధంగా ఉంది.

బాలికల తల్లిదండ్రులకు శుభవార్త

ప్రస్తుతం క్యాన్సర్ విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా బాలికలు ఎవరూ క్యాన్సర్ బారిన పడకూడదని భావించిన ప్రభుత్వం, రాష్ట్రంలో సుమారు 4.60 లక్షల మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించాలని నిర్ణయించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బాలికల తల్లిదండ్రులకు ఒక శుభవార్త అని చెప్పాలి.

తెలంగాణలో 15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని రేవంత్‌ ప్రభుత్వం ప్లాన్‌లో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి.

15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పివి టీకాలు

సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే జరిగింది. దీని ద్వారా పాఠశాలల బయట ఉన్న బాలికల వివరాలను సేకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులను కట్టడి చేయడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పివి టీకాలను వేయించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు కల్పించకపోవడం వల్ల సైలెంట్ కిల్లర్ అంటారు.

క్యాన్సర్ కట్టడికి తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

వ్యాధి ముదిరే కొద్ది లక్షణాలు బయటపడి, అది తీవ్ర దశకు చేరుకుంటుంది. అప్పుడు చికిత్స చేయడం, ప్రాణాలు కాపాడడం కూడా కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 15 ఏళ్ల యుక్త వయసులో ఉన్న బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి మంచి మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగానే తెలంగాణ సర్కార్ హెచ్‌పివి వ్యాక్సిన్ ను టీనేజ్ బాలికలకు ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ బయట కొనాలంటే ఖర్చు

ఈ వ్యాక్సిన్ బయట కొనుగోలు చేస్తే ఒక్కో డోస్ కు 2000 రూపాయల నుంచి 4000 వరకు ఖర్చవుతుంది. 15 సంవత్సరాలు నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ మూడు డోసులు అవసరం. ఈ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేసి టీకాలు అందించే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.

వ్యాక్సిన్ ఇప్పించటం మరచిపోవద్దు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి ఉపయోగపడుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కనుక 15 ఏళ్ల వయస్సు ఉన్న బాలికల తల్లిదండ్రులు ఎవరూ పట్టించుకోకుండా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను ఇప్పించాలి.

ఆంగ్ల సారాంశం

ప్రస్తుతం క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఏ బాలిక కూడా క్యాన్సర్‌తో బాధపడకూడదని ఆకాంక్షిస్తూ, సుమారు 4.60 లక్షల మంది బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Source link