seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 4:11 pm Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణాకు కేంద్రం ఊహించని గిఫ్ట్.. ఏకంగా 424 కోట్లు! | తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం, రైతుల రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు రూ.424 కోట్ల ప్రోత్సాహకం

[ad_1]

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం నుంచి తెలంగాణకు ఊహించని భారీ ప్రోత్సాహకం లభించింది. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్య సమయానికి పూర్తిచేసినందుకు రాష్ట్రానికి 424 కోట్లు నిర్థారించింది. దేశంలో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అయితే వాటిలో తెలంగాణ ముందంజలో నిలిచింది.

ఫార్మర్ రిజిస్ట్రీ తో రైతుల పూర్తి డేటా బేస్

వ్యవసాయ రంగంలో పారదర్శకత, రైతుల వివరాల సమగ్ర నమోదును వేగవంతంగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రైతులకు సంబంధించిన సమగ్ర రిజిస్టర్. రైతుల భూమి, పంటలు, పంట బీమా, సబ్సిడీలు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను సమగ్రంగా నమోదు చేసే వ్యవస్థ. ఈ డేటాబేస్ ద్వారా నేరుగా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవడం సులభం.

రైతుల రిజిస్ట్రీని పూర్తి చేసినందుకు గాను రూ.424 కోట్ల ప్రోత్సాహకం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

కేంద్రం ప్రోత్సాహక నిధులు

అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు పారదర్శకంగా రైతులకు అందించడానికి ఇది మరింత సహాయపడుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహక నిధులు అందజేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం నుండి ప్రత్యేక ప్రోత్సాహకం సాధించడంలో కీలకంగా పనిచేసిన అధికారులను అభినందించారు.

పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న తెలంగాణ

లక్ష్యాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయడం ద్వారా తెలంగాణ మరోసారి తన పరిపాలన నిరూపించుకుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పనిని సమర్థంగా అమలు చేయాలని సూచించారు.రాష్ట్రంలో రైతుల వివరాల ప్రక్రియను గ్రామస్థాయి నుంచి సమగ్రంగా నిర్వహించారని, సాంకేతిక వనరులను వినియోగించి డేటా సేకరణను వేగవంతం చేశారని తెలిపారు.

రైతు సంక్షేమం కోసం తెలంగాణ చర్యలకు ఇది మరో గుర్తింపు

ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తికావడంతో భవిష్యత్తులో రైతులకు అందే సబ్సిడీలు, ఆర్థిక సహాయం, బీమా పరిహారాలు మరింత వేగంగా చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రోత్సాహక నిధులు వ్యవసాయ రంగ అభివృద్ధికి, డిజిటల్‌ మౌలిక సదుపాయాల బలోపేతానికి వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించింది. రైతు సంక్షేమం దిశగా తెలంగాణ చర్యలకు ఇది మరో గుర్తింపుగా ఉంది.

[ad_2]

Source link