తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం నుంచి తెలంగాణకు ఊహించని భారీ ప్రోత్సాహకం లభించింది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్య సమయానికి పూర్తిచేసినందుకు రాష్ట్రానికి 424 కోట్లు నిర్థారించింది. దేశంలో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అయితే వాటిలో తెలంగాణ ముందంజలో నిలిచింది.
ఫార్మర్ రిజిస్ట్రీ తో రైతుల పూర్తి డేటా బేస్
వ్యవసాయ రంగంలో పారదర్శకత, రైతుల వివరాల సమగ్ర నమోదును వేగవంతంగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రైతులకు సంబంధించిన సమగ్ర రిజిస్టర్. రైతుల భూమి, పంటలు, పంట బీమా, సబ్సిడీలు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను సమగ్రంగా నమోదు చేసే వ్యవస్థ. ఈ డేటాబేస్ ద్వారా నేరుగా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవడం సులభం.

కేంద్రం ప్రోత్సాహక నిధులు
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు పారదర్శకంగా రైతులకు అందించడానికి ఇది మరింత సహాయపడుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహక నిధులు అందజేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం నుండి ప్రత్యేక ప్రోత్సాహకం సాధించడంలో కీలకంగా పనిచేసిన అధికారులను అభినందించారు.
పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న తెలంగాణ
లక్ష్యాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయడం ద్వారా తెలంగాణ మరోసారి తన పరిపాలన నిరూపించుకుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పనిని సమర్థంగా అమలు చేయాలని సూచించారు.రాష్ట్రంలో రైతుల వివరాల ప్రక్రియను గ్రామస్థాయి నుంచి సమగ్రంగా నిర్వహించారని, సాంకేతిక వనరులను వినియోగించి డేటా సేకరణను వేగవంతం చేశారని తెలిపారు.
రైతు సంక్షేమం కోసం తెలంగాణ చర్యలకు ఇది మరో గుర్తింపు
ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తికావడంతో భవిష్యత్తులో రైతులకు అందే సబ్సిడీలు, ఆర్థిక సహాయం, బీమా పరిహారాలు మరింత వేగంగా చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రోత్సాహక నిధులు వ్యవసాయ రంగ అభివృద్ధికి, డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతానికి వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించింది. రైతు సంక్షేమం దిశగా తెలంగాణ చర్యలకు ఇది మరో గుర్తింపుగా ఉంది.
-
రైతన్నలకు పిడుగు లాంటి వార్త, ఈసారి వర్షాలు డౌటే!
<!--
--> -
పెట్రోల్ రూల్స్ మారాయ్, ఇక పాత బండ్ల మైలేజ్ ఢమాల్!
<!--
--> -
మరికాసేపట్లో మీ వాట్సాప్ బ్లాక్, సిమ్ బైండింగ్ రూల్ అమలులోకి!
<!--
--> -
వేసేవి హిందూ వేషాలు- చేసేవి క్రైస్తవ పనులు: కాపుల నుంచి కన్వర్షన్ అంబాసిడర్
<!--
--> -
మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ల కెరీర్లో మాయని మచ్చలా మిగిలిన సినిమా ఇదొక్కటే
<!--
--> -
ఉచిత ప్రయాణంలో కీలక మార్పు, తాజా మార్గదర్శకాలు..!!
<!--
--> -
కుప్పకూలుతున్న బంగారం ధరలు
<!--
--> -
T20 World Cup: ఇన్ని కష్టాల మధ్య తాజాగా ఓ గుడ్ న్యూస్..!
<!--
--> -
Nara Lokesh: లోకేష్ గొప్ప మనసు- ఆ చిన్నారి ప్రాణం కోసం 6 కోట్ల సాయం..!
<!--
--> -
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక యథావిధిగా, ముహూర్తం ఫిక్స్- కొత్త లుక్, కీలక మార్పులు..!!
<!--
--> -
Ind vs Zim: అద్భుతమైన సమస్య అదే-అందుకే ఆ మార్పు? తేల్చేసిన బ్యాటింగ్ కోచ్..!
<!--
--> -
బాలయ్యతో దిల్ రాజు సినిమా ఫిక్స్.. డైరెక్టర్ అతడే
<!--
--> -
మార్చి నెలలో శుక్రుడి దయతో వీరికి లక్ష్మీ కటాక్షం.. సంపన్న యోగం!
<!--
--> -
హైదరాబాద్ TO గోవా, ఉడిపి, మురుడేశ్వర్.. ఆర్టీసీ బస్సులో.. తక్కువ ధరకే..
<!--
--> -
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ – ముహూర్తం, రూట్, షెడ్యూల్..!!
<!--
-->
ఆంగ్ల సారాంశం
రైతు నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.424 కోట్లు మంజూరు చేసింది. దేశంలోనే ఈ మైలురాయిని సాధించిన మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని, లక్ష్యాన్ని చేరుకున్నందుకు అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు.